21 ఏళ్లకే వేల కోట్ల అధిపతి

Kaivalya Vohra
x

Kaivalya Vohra

Highlights

Kaivalya Vohra: కైవల్య ఓహ్రా... హురున్ ప్రకటించిన ధనికుల జాబితాలో అత్యంత పిన్నవయస్కుడిగా పేరొందిన యువకుడు ఈ కైవల్య ఓహ్రా. మన దేశంలో బాగా డబ్బున్న...

Kaivalya Vohra: కైవల్య ఓహ్రా... హురున్ ప్రకటించిన ధనికుల జాబితాలో అత్యంత పిన్నవయస్కుడిగా పేరొందిన యువకుడు ఈ కైవల్య ఓహ్రా. మన దేశంలో బాగా డబ్బున్న వాళ్ల పేర్లతో ఐఐఎఫ్ఎల్ వెల్త్ - హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ఓ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో కైవల్య ఓహ్రా ఓ పెను సంచలనం. ఎందుకంటే, 21 ఏళ్ల వయస్సులోనే ఇప్పుడు ఆ యువకుడి మొత్తం ఆస్తి విలువ రూ. 3600 కోట్లు. కైవల్య ఓహ్రా ఇంకెవరో కాదు.. క్విక్ కామర్స్ బిజినెస్‌లో దూసుకుపోతున్న జెప్టో యాప్ సహ వ్యవస్థాపకుడు. అన్నట్లు ఈ శ్రీమంతుల జాబితాలో ఓహ్రా తరువాతి స్థానంలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు.. జెప్టో బిజినెస్‌లో తనతో కలిసి పనిచేస్తోన్న ఆదిత్ పలిచనే. ఆదిత్ పలిచ వయస్సు 22 ఏళ్లు. ఓహ్రాకంటే జస్ట్ ఏడాది పెద్ద.. అంతే. జెప్టో బిజినెస్‌లో వీళ్లిద్దరూ కో ఫౌండర్స్.

చిన్న వయస్సులోనే వీళ్లు అంత డబ్బెలా సంపాదించారు..

కైవల్య ఓహ్రా, ఆదిత్ పలిచ ఇద్దరూ స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ విద్యార్థులే. కంప్యూటర్ సైన్స్ కోర్సు చదువుతున్న ఈ ఇద్దరూ దానిని మధ్యలోనే వదిలేసి ఉన్నట్లుండి ఎంటర్‌ప్రెన్యువర్‌షిప్ కోర్సులో చేరారు. ఎంతయినా ఎంటర్‌ప్రెన్యువర్‌షిప్ కోర్సు కదా.. అందుకే ఇక్కడే వాళ్లు బాగా బిజినెస్ సీక్రెట్స్‌ని ఒంటపట్టించుకున్నారు. అదే సమయంలో వారికి కరోనావైరస్ లాక్‌డౌన్ తరువాత అందరు రకరకాల సమస్యలతో సతమతమవుతుండగా.. ఆ సవాళ్ల మధ్యే వీళ్లిద్దరూ ఓ అవకాశాన్ని వెదుకున్నారు. అదే క్విక్ డెలివరి యాప్. దానికి వాళ్లు పెట్టుకున్న పేరే జెప్టో. 2021 లో జెప్టో బిజినెస్ స్టార్ట్ చేశారు.

ఇండియాలో అమేజాన్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, టాటా గ్రూప్‌నకి చెందిన బిగ్ బాస్కెట్ వంటి టాప్ ప్లేయర్స్ మధ్య జెప్టో కూడా స్పీడ్ డెలివరీతో దూసుకుపోతోంది.

ఐఐఎఫ్ఎల్ వెల్త్ - హురున్ ఇండియా రిచ్ లిస్ట్ రూపొందించిన ఈ శ్రీమంతుల జాబితాలోకి ఎక్కడం కైవల్య ఓహ్రాకి ఇదేం మొదటిసారి కాదు. 2022 లోనే ఓహ్రా తన 19వ ఏట ఈ జాబితాలో తొలిసారి స్థానం సంపాదించుకున్నారు. అప్పటి నుండి తన స్థానాన్ని అలా పెంచుకుంటూనే వస్తున్నారు.

ఈ ఏడాదిలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ - హురున్ ఇండియా రిచ్ లిస్ట్ మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఈసారి ఈ జాబితాకెక్కిన బిలియనీర్ల సంఖ్య మొట్టమొదటిసారిగా 300 మైలురాయికి చేరింది. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ, కార్పొరేట్ సెక్టార్, క్విక్ కామర్స్ బిజినెస్.. ఇలా అన్ని విభిన్నరంగాల నుండి శ్రీమంతులకు ఆ జాబితాలో చోటు లభించింది.

అంతేకాదు.. ఈసారి గౌతం అదాని ఆస్తి 11.6 లక్షల కోట్లకు పెరగడంతో ఏకంగా ముఖేష్ అంబానినే వెనక్కి నెట్టేస్తూ కుబేరుల జాబితాలో తొలిస్థానం అందుకున్నారు. 2020 ఏడాదిలో వెల్లడించిన జాబితాలో గౌతం అదాని 4వ స్థానంలో ఉండే. అలాంటిది ఈసారి టాప్ పొజిషన్‌లోకి వచ్చేశారంటే ఈ నాలుగేళ్లలో అదాని ఆస్తి ఏ రెంజులో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క చివరి ఏడాదిలోనే గౌతం అదాని ఆస్తి 95 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇక్కడే అందరికీ హిండెన్‌బర్గ్ నివేదిక కూడా గుర్తుకొస్తోంది. కైవల్య ఓహ్రాతో పాటు ఈ జాబితాలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, జోహో కార్పొరేషన్ ఫౌండర్ రాధ వెంబు, సీజన్డ్ టెక్ ఎగ్జిక్యూటీవ్‌గా పేరున్న ఆనంద్ చంద్రశేఖరన్ వంటి వారు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories