E-insurance: ఈ - ఇన్సూరెన్స్‌ వల్ల ఎవరికి ప్రయోజనం.. ఇది ఎవరికి వర్తిస్తుంది...!

Who Benefits From e-insurance how Does it Work
x

E-insurance: ఈ - ఇన్సూరెన్స్‌ వల్ల ఎవరికి ప్రయోజనం.. ఇది ఎవరికి వర్తిస్తుంది...!

Highlights

E insurance: ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI) ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఇన్సూరెన్స్‌ ని ప్రవేశపెట్టింది.

E insurance: ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI) ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఇన్సూరెన్స్‌ ని ప్రవేశపెట్టింది. ఇది ఒక డిజిటల్‌ ప్రక్రియ. నిత్య జీవితంలో ఇన్సూరె న్స్‌ అవసరాలు పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరూ రకరకాల ఇన్సూరెన్స్‌లు తీసుకుంటున్నారు. వీటన్నింటిని ఒక్కచోట చేర్చడం కోసం ఐఆర్‌డీఏఐ ఈ ఇన్సూరెన్స్‌ని ప్రవేశపెట్టింది. భవిష్య త్‌లో దీని అవసరం చాలా ఉంటుంది. అయితే దీని వల్ల ఉపయోగాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.

ఇకపై అన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే పాలసీలను అందించాల్సి ఉంటుంది. అంటే పాలసీదారుడికి ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్ ఓపెన్‌ చేసి అందులో పాలసీకి సంబంధించిన వివరాలను పొందుపరుస్తారు. ఈ అకౌంట్‌ సాయంతో పాలసీదారులు ఎన్ని పాలసీలు తీసుకున్నా సులువుగా యాక్సెస్‌ చేయవచ్చు. మీ స్టేటస్‌ ఏ విధంగా ఉందో తరచుగా చెక్‌ చేసుకోవచ్చు. అన్ని పాలసీలు ఒకే దగ్గర ఉండడం వల్ల కన్‌ఫ్యూజ్‌ లేకుండా ఉంటుంది.

ఇది పూర్తిగా పేప‌ర్ లెస్‌ వర్క్‌. ఆన్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. కనుక డాక్యుమెంట్లు పోగొట్టుకున్నా తిరిగి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్‌ కాపీలతో పోలిస్తే పత్రాలు కోల్పోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. పాలసీ వివరాలు, అప్‌డేట్‌ డేట్లను ఈజీగా ట్రాక్‌ చేయొచ్చు. పాలసీలో చిరునామా మార్చాలన్నా, వివరాలు అప్‌డేట్‌ చేయాలన్నా ఇ-ఇన్సూరెన్స్‌తో సులభంగా చేయవచ్చు. పాలసీల డిజిటలైజేషన్‌తో ఇన్సూరెన్స్‌ కంపెనీలు, పాలసీదారుల మధ్య కమ్యూనికేషన్‌ పెరుగుతుంది. దీంతో క్లెయిమ్‌ల ప్రక్రియ మరింత సులువుగా జరుగుతుంది. అందుకే ఐఆర్‌డీఏఐ దీనిని తప్పనిసరి చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories