Indian Railways: రైలు ఇంజిన్‌ బరువు ఎంత.. చివరి బోగికి లైట్‌ ఎందుకు ఉంటుందో తెలుసా..?

What is the Weight of the Train Engine Know why the Last Carriage has a Light
x

Indian Railways: రైలు ఇంజిన్‌ బరువు ఎంత.. చివరి బోగికి లైట్‌ ఎందుకు ఉంటుందో తెలుసా..?

Highlights

Indian Railways: భారతీయ రైల్వేని ఆసియాలో అతిపెద్ద నెట్‌వర్క్‌గా చెబుతారు.

Indian Railways: భారతీయ రైల్వేని ఆసియాలో అతిపెద్ద నెట్‌వర్క్‌గా చెబుతారు. మన దేశంలో 1 లక్షల 15 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ప్రతిరోజూ సుమారు 12617 రైళ్లు నడుస్తాయి. రోజూ లక్షల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే రైలు చివరి బోగీపై ఒక క్రాస్‌ గుర్తు ఉంటుంది. అలాగే ఒక రెడ్‌ లైట్‌ ఉంటుంది. వీటిని ఎప్పుడైనా గమనించారా.. వీటికి ప్రత్యేకమైన అర్థం ఉంది. అలాగే రైలు ఇంజిన్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా..!

మీరు రైలును చూసినప్పుడల్లా దాని చివరి బోగీలో క్రాస్ (X) గుర్తు ఉంటుంది. ఇది రైలు మొత్తం ఒక స్టేషన్‌ నుంచి మరో స్టేషన్‌ చేరిందా లేదా తెలుపుతుంది. కొన్నిసార్లు బోగిలు విడిపోతాయి. ఇలాంటి సంఘటనలని గుర్తించేందుకు చివరిబోగిపై క్రాస్‌ గుర్తు వేస్తారు. ఈ బోగి కనిపించకపోతే ఆ మార్గంలో మరో రైలు ప్రయాణించదు. దీనివల్ల ప్రమాదాన్ని నివారించవచ్చు.

అలాగే ఆఖరి బోగీలో క్రాస్ కింద లైట్ ఉంటుంది. రాత్రిపూట చీకటి కారణంగా క్రాస్ గుర్తు కనిపించదు. ఈ లైట్ ఏర్పాటు చేయడం వల్ల మనం క్రాస్ గుర్తుని చూస్తాం. దీనిని బర్నింగ్ లైట్ అని పిలుస్తారు. అలాగే చివరి బోగీపై LV అని ఒక బోర్డు ఉంటుంది. LV అంటే చివరి కంపార్ట్‌మెంట్ అని అర్థం. రైలు పూర్తిగా నడుస్తోందని ఏ కోచ్ విడిపోలేదని ఈ LV గుర్తు తెలుపుతుంది. రైలు మొత్తం ఇంజిన్ సహాయంతో నడుస్తుంది. అయితే రైలు ఇంజిన్ బరువు ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.. రైలు ఇంజిన్ బరువు సుమారు లక్షా 96 వేల కిలోలు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories