IFSC కోడ్ అంటే ఏమిటి.. బ్యాంకు లావాదేవీలకు ఇది ఎందుకు అవసరం..

What is the IFSC Code why is it Required for Bank Transactions
x

IFSC కోడ్(ఫైల్ ఫోటో)

Highlights

*IFSC అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్.

IFSC Code: చాలాసార్లు మనం బ్యాంకుకి సంబంధించిన లావాదేవీలు నిర్వహించేటప్పుడు IFSC కోడ్ గురించి వింటాం. ఇది తెలియకపోతే తర్జనభర్జన పడుతాం. అంతేకాదు ఏదో ఒక విధంగా నెంబర్‌ తెలుసుకొని పని ముగించుకుంటాం.

ఒకప్పుడు డబ్బులావాదేవీల కోసం బ్యాంకుకు వెళ్లి క్యూలో గంటలు తరబడి నిలుచొని పని ముగించేవాళ్లు. కానీ ఇప్పుడు మారిని ఆధునికతతో అన్నీ ఇంట్లో నుంచే జరుగుతున్నాయి.

డిజటల్‌ యుగం వచ్చినప్పటి నుంచి అన్ని పనులు సులువుగా అయిపోతున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా, లావాదేవీలకు సంబంధించిన చాలా పనులు ఇంట్లో నుంచే చేయవచ్చు.

మీరు డబ్బు బదిలీ చేయడానికి బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం లేదు. దీని కోసం, ఖాతా నంబర్‌తో పాటు, మరొక ప్రత్యేక కోడ్ అవసరం అదే IFSC కోడ్‌. IFSC అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఇది వాస్తవానికి ప్రతి బ్యాంక్ బ్రాంచ్‌కు ఉంటుంది.

ఆన్‌లైన్‌లో డబ్బును బదిలీ చేస్తున్నప్పుడు మీరు సరైన ఖాతా నంబర్‌తో పాటు సరైన IFSCని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం మాకు చాలా ఆప్షన్‌లు ఉన్నాయి. IMPS అంటే తక్షణ చెల్లింపు సేవలు, RTGS అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్, NEFT అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటివి. ఈ ప్రక్రియలో ఖాతాదారు లేదా సంస్థ పేరు, బ్యాంక్ పేరు, ఖాతా నంబర్, IFSC కోడ్‌ను నమోదు చేయాలి.

అన్ని వివరాలను సరిగ్గా నింపిన తర్వాత మాత్రమే డబ్బు ఆ ఖాతాకు చేరుతుంది.IFSC కోడ్ అంటే 11 అంకెల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్. ఇందులో ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు కూడా ఉంటాయి. దీనిని ఆర్బీఐ ప్రతి బ్యాంక్‌కి కేటాయిస్తుంది.

బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీలో IFSC కోడు ఉంటుంది. ఈ 11 అంకెల కోడ్‌లోని మొదటి 4 అంకెలు సంబంధిత బ్యాంకును సూచిస్తాయి. దీని తర్వాత ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంకెలు భవిష్యత్ ఉపయోగం కోసం కేటాయిస్తారు. చివరి 6 లేదా అంతకంటే తక్కువ అంకెలు సంబంధిత బ్యాంకు శాఖ గుర్తింపుగా చెబుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories