Savings Account vs Salary Account: సేవింగ్స్‌ అకౌంట్‌, సాలరీ అకౌంట్‌ మధ్య తేడాలేంటి..?

What Is The Difference Between Savings Account And A Salary Account Know The Complete Details
x

Savings Account vs Salary Account: సేవింగ్స్‌ అకౌంట్‌, సాలరీ అకౌంట్‌ మధ్య తేడాలేంటి..?

Highlights

Savings Account vs Salary Account: చాలా మందికి బ్యాంకులో సేవింగ్ అకౌంట్‌ ఉంటుంది. ఎవరైనా దీనిని ఓపెన్‌ చేయవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ సాలరీ అకౌంట్‌ ఓపెన్‌ చేయలేరు.

Savings Account vs Salary Account: చాలా మందికి బ్యాంకులో సేవింగ్ అకౌంట్‌ ఉంటుంది. ఎవరైనా దీనిని ఓపెన్‌ చేయవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ సాలరీ అకౌంట్‌ ఓపెన్‌ చేయలేరు. ఉద్యోగం చేసే వారికే బ్యాంకులో సాలరీ అకౌంట్‌ ఉంటుంది. ప్రతి నెలా ఈ ఖాతాలో సాలరీ పడుతుంది. అయితే ఈ రోజు సేవింగ్స్ అకౌంట్‌, సాలరీ అకౌంట్‌ మధ్య తేడాల గురించి తెలుసుకుందాం.

మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి సేవింగ్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయవచ్చు. దీని కోసం గుర్తింపు కార్డు, కొన్ని పత్రాలను బ్యాంకులో సమర్పించాలి. కానీ మీరు సొంతంగా సాలరీ అకౌంట్‌ను ఓపెన్‌ చేయలేరు. కంపెనీ లేదా కార్పొరేషన్ అభ్యర్థనపై మాత్రమే బ్యాంక్ సాలరీ అకౌంట్‌ను ఇస్తుంది. విశేషమేమిటంటే.. జీతాన్ని సాలరీ అకౌంట్‌కు బదిలీ చేసే ముందు బ్యాంకు కంపెనీ నుంచి డబ్బు తీసుకుంటుంది. తర్వాత దానిని ఉద్యోగులందరికి పంపిణీ చేస్తుంది.

ఖాతాగా ఉపయోగించవచ్చు

సాధారణంగా సాలరీ అకౌంట్‌ ఉద్యోగికి జీతం చెల్లించడానికి యజమాని ద్వారా ఓపెన్‌ అవుతుంది. డబ్బు డిపాజిట్ చేయడం కోసం ఇది ఓపెన్‌ చేయలేము. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రకారం సేవింగ్స్‌, సాలరీ అకౌంట్లను ఇన్‌స్టా అకౌంట్లుగా ఓపెన్‌ చేయవచ్చు. అకౌంట్‌లో ఎలాంటి బ్యాలెన్స్ మెయింటెన్‌ చేయకుండా సంవత్సరం పాటు పొదుపు ఖాతాగా ఉపయోగించవచ్చు.

మూడు నెలల పాటు సాలరీ అకౌంట్‌లో జీతం క్రెడిట్ కాకపోతే అది సేవింగ్స్ అకౌంట్‌గా మారిపోతుంది. తర్వాత ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటన్‌ చేయాలి. అవసరమనుకుంటే ఈ అకౌంట్‌ను మళ్లీ సాలరీ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. దీని కోసం మీరు బ్యాంకుకు దరఖాస్తు ఫారమ్‌ను అందివ్వాలి. అయితే మీరు మళ్లీ ఉద్యోగంలో చేరినప్పుడు మాత్రమే సాలరీ అకౌంట్‌గా మార్చుకోవడానికి బ్యాంక్ అనుమతి ఇస్తుంది. ఇక వడ్డీ గురించి మాట్లాడినట్లయితే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌, సాలరీ అకౌంట్‌ రెండింటిపై ఒకే వడ్డీని ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories