LIC and PPF: ఎల్‌ఐసీ, పీపీఎఫ్ మధ్య తేడాలేంటి..? పెట్టుబడి పెట్టడానికి ఏది మంచిది..

What is the Difference Between LIC and PPF Which is Better to Invest in  LIC and PPF
x

LIC and PPF: ఎల్‌ఐసీ, పీపీఎఫ్ మధ్య తేడాలేంటి..? పెట్టుబడి పెట్టడానికి ఏది మంచిది..

Highlights

LIC and PPF: కష్టపడి సంపాదించిన సొమ్మును ఎక్కడ పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని సామాన్యుడు నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మంచి లాభాలు సంపాదించడానికి...

LIC and PPF: కష్టపడి సంపాదించిన సొమ్మును ఎక్కడ పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని సామాన్యుడు నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మంచి లాభాలు సంపాదించడానికి మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎల్‌ఐసీ, మరొకటి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న పబ్లిక్‌ ప్రావిడెంట్ ఫండ్‌ ఉన్నాయి. ఈ రెండు పెట్టుబడికి బెస్ట్‌ అని నిపుణుల వాదన. కానీ ఇందులో ఏది బెటర్‌ అనేది వినియోగదారుడు నిర్ణయించుకోవాలి. ఈ రెండిటి గురించి వివరంగా తెలుసుకుందాం.

PPF అంటే సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ LIC అంటే ఇన్సూరెన్స్, రిస్క్ ప్రొటెక్షన్. PPFలో సంపాదించిన వడ్డీ సంవత్సరానికి 7.1 ఇది ఏటా మొత్తనికి కలుస్తుంది. LIC రాబడి పాలసీపై ఆధారపడి ఉంటుంది. దాదాపు 4-6 శాతం వరకు ఉంటుంది. PPF కాలం 15 సంవత్సరాలు అయితే LIC కాలం మారుతూ ఉంటుంది. ప్లాన్ తీసుకున్న వ్యక్తి దానిని నిర్ణయిస్తాడు. పిపిఎఫ్‌లో అకౌంటు ముందస్తుగా మూసివేయడానికి అవకాశం ఉండదు. PPFని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా LICని IRDA నిర్వహిస్తుంది.

మీరు పీపీఎఫ్‌లో రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. LIC ప్రీమియం ఫిక్స్ ఉంటుంది. మీరు 7వ సంవత్సరం నుంచి PPFలో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత లోన్ తీసుకోవచ్చు. LIC పాలసీకి 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. PPF EEE కేటగిరీ కింద వస్తుంది అంటే పెట్టుబడి, వడ్డీ, రాబడి అన్నీ పన్ను రహితం. మీరు LIC హామీ మొత్తంలో 10% వరకు ప్రీమియం చెల్లిస్తే దానిపై పన్ను విధించరు. డెత్ బెనిఫిట్‌లో పొందిన డబ్బు కూడా పన్ను రహితంగా ఉంటుంది.

రిటర్న్‌లను పరిశీలిస్తే PPF 7 శాతం రాబడిని ఇస్తుంది. LIC 4-6 శాతానికి పెరుగుతుంది. ఇప్పుడు పెట్టుబడి మీకు ముఖ్యమా లేక బీమా ముఖ్యమా అని మీరు నిర్ణయించుకోవాలి. PPF పెట్టుబడిపై రాబడికి హామీ ఇస్తుంది. అయితే LIC బీమా హామీ ఇస్తుంది. PPF మీకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. LIC మీకు జీవిత బీమాను అందిస్తుంది. కొంత వరకు డబ్బు కూడా హామీ ఇచ్చినప్పటికీ. ఎక్కువ రాబడి మాత్రం రాదు. కానీ సంతృప్తికరమైన మొత్తం అందుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories