వ్యాపారానికి పెట్టుబడి కావాలా? ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలు

what is mudra loan scheme, how to apply
x

వ్యాపారానికి పెట్టుబడి కావాలా? ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలు

Highlights

ఏదైనా వ్యాపారం ప్రారంభించేందుకు పెట్టుబడి లేదని ఇబ్బంది పడుతున్నారా? ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకంతో పెట్టుబడికి ఆర్ధిక సహాయం పొందొచ్చు

ఏదైనా వ్యాపారం ప్రారంభించేందుకు పెట్టుబడి లేదని ఇబ్బంది పడుతున్నారా? ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకంతో పెట్టుబడికి ఆర్ధిక సహాయం పొందొచ్చు. 2015 ఏప్రిల్ 8న వ్యాపారులు, ఎంటర్ ప్రెన్యూర్ల కోసం ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. 50 వేల నుంచి 10 లక్షల వరకు ఈ స్కీమ్ కింద రుణాలు పొందవచ్చు. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు విభాగాలుగా ఈ స్కీమ్ ను విభజించారు.

50 వేల లోపు రుణాలను శిశు విభాగం కింద పరిగణిస్తారు. 50 వేల నుంచి 5 లక్షల రుణాలను కిశోర్ విభాగం పరిధిలోకి వస్తాయి. ఇక 5 లక్షల నుంచి 10 లక్షలలోపు రుణాలు తరుణ్ విభాగంగా పరిగణిస్తారు.ఈ స్కీమ్ కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, బ్యాంకు స్టేట్ మెంట్, ఐటీ స్టేట్ మెంట్, జీఎస్ టీ గుర్తింపు నెంబర్, పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.

వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు, ట్రేడింగ్, సర్వీస్ రంగంలోని వ్యాపారాలకు ఈ స్కీమ్ కింద రుణాలు లభిస్తాయి. ముద్రా రూపే కార్డు కింద రుణం ఇస్తారు. ముద్రా లోన్ అకౌంట్ తో ఈ కార్డు లింక్ చేసి ఉంటుంది. ఈ డెబిట్ కార్డుతో మీకు అవసరమైన డబ్బులను బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు.

ముద్రా లోన్ కోసం ఆన్ లైన్ లో లేదా జాతీయ బ్యాంకుల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ ఆదాయం ఉన్నవారు వ్యాపారాలు చేసుకునేందుకు ఈ రుణం దోహదం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ వ్యాపారులకు ప్రాధాన్యత ఇస్తారు. కూరగాయలు, పండ్ల వ్యాపారులు, సెలూన్లు, బూటీ పార్లర్లు సహా ఇతర వ్యాపారాల కోసం ఈ రుణం దరఖాస్తు చేసుకోవచ్చు.శిశు రుణాలకు సంబంధించి 1 నుంచి 12 శాతం వడ్డీ రేట్లుంటాయి. కిశోర్ రుణాలకు 8.6 శాతం, తరుణ్ రుణాలకు 11.15 శాతం నుంచి 20 శాతం వడ్డీని వసూలు చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories