Atal Pension Yojana: అటల్‌ పెన్షన్‌ యోజనకు అప్లై చేశారా.. వీరు మాత్రమే అర్హులు..!

What is Atal Pension Yojana how Indian citizens can avail this Scheme
x

Atal Pension Yojana: అటల్‌ పెన్షన్‌ యోజనకు అప్లై చేశారా.. వీరు మాత్రమే అర్హులు..!

Highlights

Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. వీటిలో చేరడం వల్ల వారికి ఆర్థిక భరోసా లభిస్తుంది. అలాంటి పథకాలలో అటల్ పెన్షన్ యోజన ఒకటి.

Atal Pension Yojana: కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. వీటిలో చేరడం వల్ల వారికి ఆర్థిక భరోసా లభిస్తుంది. అలాంటి పథకాలలో అటల్ పెన్షన్ యోజన ఒకటి. ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలన్నదే ఈ స్కీం ఉద్దేశ్యం. అరవై ఏళ్ల తర్వాత ఎవరిపై ఆధారపడుకుండా హ్యాపీగా బతకడానికి ఈ స్కీం ఉపయోగపడుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015లో ఈ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకంలో ఏం జరుగుతుంది, మీరు ఈ పథకం ప్రయోజనం ఎలా పొందవచ్చో ఈ రోజు తెలుసుకుందాం.

పథకం ప్రయోజనం

దేశంలోని ప్రతి పౌరుడిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది. భారత ప్రభుత్వ అటల్ పెన్షన్ పథకం కింద 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు మాత్రమే అకౌంట్‌ను ఓపెన్ చేయగలరు.

ఎలా ప్రయోజనం పొందవచ్చు?

అటల్ పెన్షన్ యోజన కోసం ఏదైనా బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ డిజిటల్ సర్వీస్ ద్వారా అకౌంట్ ఓపెన్‌ చేయవచ్చు. ఈ పథకంలో సేవింగ్స్ ఖాతా ద్వారా ఒక నెల, మూడు నెలలు లేదా ఆరు నెలల పాటు ఆటో డెబిట్ సౌకర్యం ద్వారా ప్రీమియం చెల్లించాలి. ఈ పథకం కింద 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత రూ.1000 నుంచి రూ. 5000 వరకు జీవితకాల పెన్షన్ పొందుతారు. ఖాతాదారులు ఎప్పుడైనా పెన్షన్ మొత్తాన్ని అప్‌గ్రేడ్ చేయవచ్చు లేదా డౌన్‌గ్రేడ్ చేయవచ్చు. అలాగే మీరు ప్రీమియం చెల్లింపు సమయాన్ని నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-సంవత్సరానికి మార్చుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories