Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా.. అవేంటంటే..?

What are the Benefits of Taking Health Insurance and why is it Important
x

Health Insurance:హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా.. అవేంటంటే..?

Highlights

Health Insurance: దేశంలో కరోనా వల్ల సామాన్యుల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది.

Health Insurance: దేశంలో కరోనా వల్ల సామాన్యుల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కరోనాకు ముందు చాలామందిలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ గురించి అవగాహన లేదు. కానీ ఇప్పుడు దీని గురించి చాలామంది ఆలోచిస్తున్నారు. అంతేకాదు కచ్చితంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా సమయంలో లక్షల రూపాయలు ఆసుపత్రులలో ఖర్చు చేసినా కుటుంబ సభ్యులని బతికించుకోలేకపోయారు. అందుకే చాలామందిలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలుపై అవగాహన పెరిగింది. దీంతో పాటు ఆదాయపు పన్ను మినహాయింపు లభించడంతో చాలామంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు.

ఈరోజు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అనేది మీ జీవితానికి అత్యవసరం. దీంతో మీరు వైద్య, శస్త్రచికిత్స ఖర్చులని క్లెయిమ్ చేయవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఆసుపత్రి, మందుల ఖర్చు మీ జేబులో నుంచి పెట్టుకోనవసరం లేదు. ఇన్సూరెన్స్‌ కంపెనీ మీరు తీసుకున్న పాలసీ ప్రకారం ఈ మొత్తం ఖర్చును చెల్లిస్తుంది. సాధారణంగా బీమా కంపెనీలు పెద్ద ఆసుపత్రులతో టై-అప్‌లను కలిగి ఉంటాయి. తద్వారా మీరు నగదు రహిత చికిత్సను సులభంగా పొందవచ్చు.

ఒకవేళ సదరు ఇన్సూరెన్స్ కంపెనీకి హాస్పిటల్‌తో ఎలాంటి ఒప్పందమూ లేకుంటే పాలసీదారుడు చికిత్సకు అయ్యే బిల్లుల ఆధారంగా అతనికి రీయింబర్స్ చేస్తుంది. మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నట్లయితే ప్లాన్‌లను బట్టి నగదు రహిత చికిత్సకు వెళ్లవచ్చు. ఇన్సూరెన్స్‌ చేసిన వారి రవాణా కోసం అంబులెన్స్ ఖర్చులు కూడా ఇందులో కవర్ అవుతాయి. దీనికి చెల్లించే ప్రీమియం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి కింద పన్ను మినహాయింపు ఉంటుంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వివిధ రకాల టెస్ట్‌ల కోసం పనికి వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories