Before Starts SIP: సిప్‌ ద్వారా అధిక లాభం పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలను గమనించండి..!

Want To Get High Profit Through SIP But Keep These Things In Mind
x

Before Starts SIP: సిప్‌ ద్వారా అధిక లాభం పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలను గమనించండి..!

Highlights

Before Starts SIP: నేటి రోజుల్లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో (sip) పెట్టుబడి పెట్టేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

Before Starts SIP: నేటి రోజుల్లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో (sip) పెట్టుబడి పెట్టేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చాలామందికి దీనిపై అవగాహన వచ్చింది. కానీ కొన్ని తప్పులు చేయడం వల్ల దీర్ఘకాలం కొనసాగించలేకపోతున్నారు. సిప్‌ ద్వారా తక్కువ మొత్తంతో పెద్ద ఫండ్‌ సృష్టించవచ్చు. SIP చేసే ఏ విషయాలను గుర్తుంచుకోవాలి అనే విషయాన్ని ఈ రోజు తెలుసు కుందాం.

ముందుగా రీసెర్చ్‌

సిప్‌ని ప్రారంభించే ముందు రీసెర్చ్‌ చేయడం అవసరం. ఎక్స్‌పర్ట్స్‌ నుంచి సలహాలు తీసుకోవాలి. నష్టం మొత్తం ఏ విధంగా ఉంటుందో అంచనా వేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే సిప్‌ని ప్రారంభించాలి. లేదంటే తర్వాత బాధపడుతారు.

చిన్న మొత్తంలో పెట్టుబడి

సిప్‌లో ఎప్పుడైనా చిన్న మొత్తంతో ప్రారంభించాలి. భారీ మొత్తంతో సిప్‌ని ప్రారంభిస్తే నష్టం వస్తే అధిక మొత్తం కోల్పోవాల్సి ఉంటుంది. దీనితో పాటు భవిష్యత్‌లో ఏదైనా ఆర్థిక సమస్యను ఎదుర్కొంటే సిప్‌ని కొనసాగించడం కష్టం అవుతుంది. ప్రారంభంలో చిన్న మొత్తంలో 2 లేదా 3 సిప్‌లను ప్రారంభించవచ్చు.

అకస్మాత్తుగా సిప్‌ ఆపవద్దు

అకస్మాత్తుగా సిప్‌ని ఆపకూడదు. ఇన్వెస్టర్లు మొదట ఉత్సాహం చూపడం తర్వాత నిరుత్సాహపడుతారు. మాంద్యం, మార్కెట్ క్షీణతను చూసి ఆపవద్దు. ఇలా చేయడం వల్ల ఇన్వెస్టర్లు నష్టపోవాల్సి వస్తుంది. మాంద్యం సమయంలో ఓపికగా ఉండాలి తక్కువ సమయంలో కోలుకున్న తర్వాత దాని నుంచి మీ డబ్బును విత్‌ డ్రా చేసుకోవచ్చు.

లక్ష్యాన్ని సెట్ చేసి సిప్‌ చేయాలి

మీరు ఎల్లప్పుడూ సిప్‌ వంటి పెట్టుబడులను లక్ష్యంతో ప్రారంభించాలి. పిల్లల వివాహం, విద్య లేదా పదవీ విరమణ కోసం సిప్‌ని ప్లాన్ చేయవచ్చు. ఇది మీ మనస్సును ధృడంగా ఉంచుతుంది. విత్‌ డ్రా చేయకుండా కంటిన్యూస్‌గా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories