Business Idea: మేడపై ఖాళీ స్థలం ఉందా.? రూపాయి పెట్టుబడి లేకుండా భారీ ఆదాయం

Business Idea: మేడపై ఖాళీ స్థలం ఉందా.? రూపాయి పెట్టుబడి లేకుండా భారీ ఆదాయం
x
Highlights

Business Idea: ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ప్రతీ ఒక్కరూ రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు.

Business Idea: ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ప్రతీ ఒక్కరూ రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే మనలో చాలా మంది పెట్టుబడికి భయపడి వ్యాపారానికి దూరంగా ఉంటారు. కానీ ఎలాంటి పెట్టుబడి లేకుండా భారీగా ఆదాయం ఆర్జించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఒకప్పుడు ఊరికి చివరల్లో మాత్రమే ఒక సెల్‌ ఫోన్‌ టవర్‌ ఉండేది. కానీ ప్రస్తుతం బిల్డింగ్స్‌పై చిన్న చిన్న టవర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. టెలికం కంపెనీలు ఇటీవల ఈ ట్రెండ్‌ను ఎక్కువగా ఫాలో అవుతున్నాయి. మేడపై ఖాళీ ప్రదేశం ఉంటే చాలు ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రతీ నెల ఆదాయం పొందొచ్చు. ఇంతకీ సెల్‌ ఫోన్‌ టవర్‌ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరపడుతుంది.? ఆదాయం ఎలా ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మేడపై టవర్‌ ఏర్పాటు చేయడానికి సుమారు 500 చదరపు అడుగుల స్థలం అవసరం ఉంటుంది. మీ మేడపై స్థలం అందుబాటులో ఉండి, మీ ఇంటికి చుట్టుపక్కల టవర్స్‌ లేకపోతే.. నేరుగా టెలికం కంపెనీలను సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఇందుకు సంబంధించి సమాచారం లభిస్తుంది. అయితే టవర్స్‌ ఏర్పాటు చేసే విషయంలో టెలికం కంపెనీలు కొన్ని నిబంధనలు పాటిస్తుంది. టవర్స్‌ ఆసుపత్రులకు కనీసం 100 మీటర్ల దూరంలో ఉండేలా చూసుకుంటారు. కంపెనీ ఆధారంగా, ప్రాంతం ఆధారంగా నెలకు రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఆదాయం పొందొచ్చు.

ఇక మేడపై ఉన్న ఖాళీ స్థలంలో రెస్టారెంట్స్‌ బిజినెస్‌ ట్రెండ్ కూడా ఇటీవల పెరుగుతుంది. ముఖ్యంగా ఓపెన్‌ టెర్రస్‌తో కాఫీ షాప్స్‌, టీ షాప్స్‌ వంటివి ఏర్పాటు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారికి మీ మేడపై ఉన్న ఖాళీ స్థలాన్ని అద్దెకు ఇచ్చుకొని మంచి లాభాలు ఆర్జించవచ్చు. ముఖ్యంగా సెమీ అర్బన్ పట్టణాల్లో ఈ కల్చర్‌ ఎక్కువుతోంది. ప్రాంతం బట్టి మీ మేడపై ఉన్న స్థలానికి కనీసం రూ. 10 వేల నుంచి ఆదాయం పొందొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories