UPI Payments: ఇకపై శ్రీలంక, మారీషస్ దేశాల్లోనూ మన UPI పేమెంట్స్

UPI Services Launched In Sri Lanka And Mauritius
x

UPI Payments: ఇకపై శ్రీలంక, మారీషస్ దేశాల్లోనూ మన UPI పేమెంట్స్ 

Highlights

UPI Payments: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన మూడు దేశాల ప్రధానులు

UPI Payments: యూపీఐ సేవలు శ్రీలంక, మారిషస్‌ దేశాల్లో ప్రారంభమయ్యాయి. భారత, శ్రీలంక, మారిషస్‌ ప్రధానులు నరేంద్ర మోదీ, రణిల్‌ విక్రమసింఘే, ప్రవింద్‌ జుగ్నాథ్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులను ప్రారంభించారు. గత ఏడాది జూలైలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భారత పర్యటన సందర్భంగా శ్రీలంకలో యూపీఐ సేవలకు సంబంధించి ఒప్పందంపై సంతకం చేశారు. భారతీయ పర్యాటకులు శ్రీలంకను సందర్శిస్తున్నందున.. యూపీఐని ఉపయోగించవచ్చన్నారు.

మారిషస్‌లో యూపీఐ సేవల ప్రారంభంపై ఆ దేశ ప్రధాని ప్రవింద్‌ జుగ్నాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. రూపేకార్డ్‌ను జాతీయ చెల్లింపుల స్విచ్‌తో కోబ్రాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. మారిషస్‌లో దేశీయ కార్డ్‌గా పరిగణిస్తామన్నారు. ఈ నెల 2న యూపీఐ సేవలు ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ఐకానిక్‌ ఈఫిల్‌ టవర్‌లో ప్రారంభించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ భారత పర్యటన సందర్భంలో జైపూర్‌లో యూపీఐ చెల్లింపులు చేశారు. సింగపూర్, యూఏఈతో సహా ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో భారతదేశ UPI ముఖ్యమైన పోషిస్తున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories