కొత్త బైక్‌ కోసం టూ వీలర్‌ లోన్‌ తీసుకోవాలా.. పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలా.. ఏది బెస్ట్ అంటే..?

Two Wheeler Loan VS Personal Loan Chek For All Details
x

కొత్త బైక్‌ కోసం టూ వీలర్‌ లోన్‌ తీసుకోవాలా.. పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలా.. ఏది బెస్ట్ అంటే..?

Highlights

Two Wheeler Loan VS Personal Loan: కొంతమందికి కొత్త బైక్‌ కొనుగోలు చేయాలని ఉంటుంది. కానీ ఫైనాన్స్‌ విషయంలో గందరగోళానికి గురవుతారు. ఎందుకంటే కొందరు టూ వీలర్‌ లోన్‌ బెస్ట్‌ అని చెబుతారు మరికొందరు పర్సనల్‌ లోన్‌ బెస్ట్‌ అని చెబుతారు.

Two Wheeler Loan VS Personal Loan: కొంతమందికి కొత్త బైక్‌ కొనుగోలు చేయాలని ఉంటుంది. కానీ ఫైనాన్స్‌ విషయంలో గందరగోళానికి గురవుతారు. ఎందుకంటే కొందరు టూ వీలర్‌ లోన్‌ బెస్ట్‌ అని చెబుతారు మరికొందరు పర్సనల్‌ లోన్‌ బెస్ట్‌ అని చెబుతారు. ఈ రెండింటిలో దేనివల్ల ఎక్కువ బెనిఫిట్స్‌ ఉంటాయో ఎవ్వరికి తెలియదు. వాస్తవానికి టూ వీలర్‌ ఫైనాన్సింగ్ విషయానికొస్తే ఈ రెండు ఎంపికలు బెస్ట్‌ అని చెప్పవచ్చు. కానీ వడ్డీ రెండింటి మధ్య తేడా ఉంటుంది. అంతేకాకుండా ఈ లోన్‌లు పర్సన్‌ టు పర్సన్‌ మారుతూ ఉంటాయి. ఈ పరిస్థితిలో జాగ్రత్తగా ఆలోచించి లోన్‌ తీసుకోవడం ఉత్తమం. ఈ రోజు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.

పర్సనల్‌ లోన్‌ అనేది ఒక అసురక్షిత రుణం. దీనిని టూ వీలర్‌ కొనుగోలుతో పాటు చాలా ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు. సౌకర్యవంతమైన రీపేమెంట్ కాలవ్యవధి, అధిక వడ్డీ రేట్లు వర్తిస్తాయి. టూ-వీలర్ లోన్ అనేది ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాల కోసం రూపొందించిన సురక్షిత రుణం. ఈ లోన్‌లు వ్యక్తిగత రుణాలతో పోలిస్తే తక్కువ వడ్డీ రేట్లు, సౌకర్యవంతమైన రీపేమెంట్, సులభమైన అర్హత ప్రమాణాలతో లభిస్తాయి. అయితే లోన్ మొత్తం పర్సనల్ లోన్‌లో వచ్చే అమౌంట్‌ కంటే తక్కువగా ఉంటుంది.

ఏ రుణం సరైనది?

పర్సనల్ లోన్, టూ-వీలర్ లోన్ ఏది ఎంచుకోవాలో గందరగోళంగా ఉంటుంది. తుది నిర్ణయం తీసుకునే ముందు కొన్ని అంశాలను పరిశీలించాలి.

వడ్డీ రేటు: టూ వీలర్‌ లోన్‌ కంటే పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే వ్యక్తిగత రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు. అయితే అతి తక్కువ వడ్డీ రేటు కోసం చూస్తున్నట్లయితే టూ వీలర్‌ లోన్‌ ఉత్తమ ఎంపిక అవుతుంది.

లోన్ మొత్తం: పర్సనల్‌ లోన్‌లతో పోలిస్తే టూ వీలర్‌ లోన్‌లు తక్కువ మొత్తాన్ని అందిస్తాయి. టూ వీలర్‌కి ఫైనాన్స్ చేయడానికి అధిక విలువ కలిగిన రుణం కోసం చూస్తున్నట్లయితే పర్సనల్‌ లోన్‌ బెస్ట్‌ అని చెప్పవచ్చు.

రీపేమెంట్ కాలపరిమితి: టూ వీలర్‌ లోన్‌తో పోలిస్తే పర్సనల్‌ లోన్‌ తిరిగి చెల్లించడంలో ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. 12 నుంచి 60 నెలల వరకు పర్సనల్ లోన్ కోసం రీపేమెంట్ వ్యవధిని ఎంచుకోవచ్చు. కానీ టూ వీలర్ లోన్‌లు సాధారణంగా 36 నెలల వరకు తిరిగి చెల్లింపు వ్యవధిని కలిగి ఉంటాయి.

అర్హత ప్రమాణాలు: టూ వీలర్‌ లోన్‌తో పోలిస్తే పర్సనల్‌ లోన్‌ల అర్హత ప్రమాణాలు కఠినంగా ఉంటాయి. స్థిరమైన ఆదాయం, మంచి క్రెడిట్ స్కోర్, సంతృప్తికరమైన క్రెడిట్ నివేదిక ఉంటే పర్సనల్‌ లోన్‌ పొందుతారు. లేదంటే టూ వీలర్‌ లోన్‌ ఎంచుకోక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories