Monthly Recharge: నెలవారీ రీఛార్జ్ వ్యాలిడిటీ 28 రోజులు కాదు ఇప్పుడు 30 రోజులు..?

Trai Directs Telecom Companies to Give Monthly Recharge Validity of 30 Days
x

Monthly Recharge: నెలవారీ రీఛార్జ్ వ్యాలిడిటీ 28 రోజులు కాదు ఇప్పుడు 30 రోజులు..?

Highlights

Monthly Recharge: సాధారణంగా అందరు నెలవారీ రిఛార్జ్ చేసుకుంటే వ్యాలిడిటీ 28 రోజులకే వస్తుంది.

Monthly Recharge: సాధారణంగా అందరు నెలవారీ రిఛార్జ్ చేసుకుంటే వ్యాలిడిటీ 28 రోజులకే వస్తుంది. ఒకటో తేదీ రాకముందే అంటే రెండు రోజుల ముందే వ్యాలిడిటీ అయిపోతుంది. దీంతో ఆ సమయంలో కస్టమర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి ( TRAI)కి చాలా కంప్లెయింట్స్‌ వచ్చాయి. దీంతో స్పందించిన ట్రాయ్ 30 రోజుల వ్యాలిడిటీ అందించాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.

ట్రాయ్ నోటిఫికేషన్‌లో ఇలా ఉంది.. "ప్రతి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కనీసం ఒక ప్లాన్ వోచర్ ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్, ఒక కాంబో వోచర్‌ను ముప్పై రోజుల చెల్లుబాటుతో అందించాలి" అని ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 60 రోజులలోపు టెలికాం కంపెనీలు ఈ ఆదేశాలను పాటించాలని నిర్ణయించింది. ఎందుకంటే చాలామంది ఉద్యోగులకు ఒకటో తేదీన డబ్బులు అందుతాయి. నెల ఇవర వ్యాలిడిటీ అయిపోవడంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ట్రాయ్ తెలిపింది.

నవంబర్ 2021 చివరి నాటికి దేశంలో టెలికాం సబ్‌స్క్రైబర్ల సంఖ్య స్వల్పంగా 1.19 బిలియన్లకు పెరిగిందని TRAI వివరించింది. ఈ సమయంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారుల సంఖ్య పెరిగింది. నివేదిక ప్రకారం రిలయన్స్ జియో మొబైల్ విభాగంలో 20,19,362 మంది సబ్‌స్క్రైబర్‌ల వృద్ధితో అగ్రగామిగా ఉంది. దాని మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్ 428 మిలియన్లకు చేరుకుంది. దీనివల్ల కస్టమర్లు సంవత్సరానికి 12 సార్లు రిఛార్జ్‌ చేసుకుంటే సరిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories