Gold Rate Today: గోల్డ్‌ లవర్స్‌కి కాస్త రిలీఫ్‌.. తగ్గిన బంగారం ధర, ఎంతంటే..?

Today November 25th gold and silver prices in Hyderabad, Vijayawada, Chennai
x

Gold Rate Today: గోల్డ్‌ లవర్స్‌కి కాస్త రిలీఫ్‌.. తగ్గిన బంగారం ధర, ఎంతంటే..?

Highlights

Gold Rate Today: అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరగడం మొదలైంది.

Gold Rate Today: అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరగడం మొదలైంది. తులం బంగారం ధర రూ. 75 వేల వరకు చేరుకున్న సందర్భాలు చూశాం. అయితే మళ్లీ నెమ్మదిగా రూ. 80 వేల మార్క్‌కు చేరుకుంటోంది. రానున్నవి పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో సహజంగానే బంగారానికి డిమాండ్‌ పెరుగుతుంది.

అయితే ఇదే సమయంలో తాజాగా సోమవారం బంగారం ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. రోజురోజుకీ పెరుగుతూ పోతున్న గోల్డ్‌ ప్రైజ్‌ కాస్త శాంతించడంతో గోల్డ్‌ లవర్స్‌ హ్యపీగా ఫీలవుతున్నారు. సోమవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. దీంతో మళ్లీ తులం బంగారం ధర రూ. 80 వేల లోపు నమోదైంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

* దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.73,140, 24 క్యారెట్ల ధర రూ.79,980 వద్ద కొనసాగుతోంది. ,

* దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990కాగా, 24 క్యారెట్ల ధర రూ.79,630గా ఉంది.

* ఇక చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990గా, 24 క్యారెట్ల ధర రూ.79,630 వద్ద కొనసాగుతోంది.

* దేశంలో మరో ప్రధాన నగరమైన బెంగళూరులో 22 గ్రాముల తులం బంగారం ధర రూ.72,990గా, 24 క్యారెట్ల ధర రూ.79,630 వద్ద కొనసాగుతోంది.

* తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.79,630 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరలో కూడా తగ్గుదల కనిపించింది. సోమవారం కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు, ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 91,900 వద్ద కొనసాగుతుండగా. హైదరాబాద్‌, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర దేశంలోనే అత్యధికంగా రూ. 1,00,900 వద్ద కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories