Gold Rate: జిగేల్ మంటోన్న బంగారం ధర

Today Gold Rate, Silver Price 7th-April-2021
x

Gold Rate:(File Image)

Highlights

Gold Rate: బంగారం ధర పెరగ్గా, వెండి రేటు మాత్రం అక్కడే నిలకడగానే కొనసాతోంది.

Gold Rate: ఈ రోజు బంగారం ధర జిగేల్‌మంటోంది. కొద్ది రోజుల క్రితం స్థిరంగా వున్న బంగారం ధరలు పైచూపులు చూస్తోంది. ఇదిలా వుండగా వెండి రేటు మాత్రం అక్కడే నిలకడగానే కొనసాగుతోంది. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గడం గమనార్హం.

హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.46,250కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.140 పెరుగుదలతో రూ.42,400కు ఎగసింది.

నిలకడగా వెండి...

వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.69,300 వద్దనే కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

వివిధ నగరాల్లో ఇలా...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,600గా పలికింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,570 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,450గా ఉంది. కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,630గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,320గా ఉంది. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉంది.

కరోనా కేసులు పెరుగుతూ ఉంటే బంగారం ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. మేలో పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. కాబట్టి మళ్లీ బంగారం నగలు కొనేందుకు ప్రజలు రెడీ అవుతారు. తద్వారా బంగారానికి మళ్లీ డిమాండ్ వస్తుంది. అలా కూడా ధర పెరిగేందుకు వీలవుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా డాలర్ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. అందువల్ల ఆ విధంగా కూడా బంగారం ధర పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతోంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 07-04-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.





Show Full Article
Print Article
Next Story
More Stories