Gold Rate Today: కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Today Gold and Silver Price in Hyderabad and india check rates and details
x

 Gold Rate Today: కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Highlights

Today Gold and Silver Price: దేశంలో బంగారం, వెండి ధరలు గురువారం కాస్త తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ఇతర నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Today Gold and Silver Price : దేశంలో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధఱ రూ. 10 తగ్గింది. ప్రస్తుతం రూ. 68, 490కి చేరుకుంది. బుధవారం ఈ ధర రూ. 68,500గా ఉంది. ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గింది. రూ. 6,84,900గా ఉంది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం 6,849గా ఉంది.

అలు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా రూ. 10 తగ్గి..రూ. 74720 వద్ద కొనసాగుతోంది. కిందటి రోజు ఈ ధర రూ. 74730గా ఉంది. అదే సమయంలో వందగ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 7,47,200గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర రూ. 7,472గా ఉంది. దేశంలోని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు గురువారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,650గా ఉండగా..24క్యారెట్ల బంగారం ధరరూ. 74,870గా ఉంది.

కోల్ కతా, ముంబై, పుణె, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నై, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,490గా ఉండగా..24క్యారెట్ల బంగారం ధర రూ. 74,720గా ఉంది. హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68, 490గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 74,720గా నమోదు అయ్యింది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖలోకూడా ఈ ధరలే ఉన్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరల్లో హెచ్చు థగ్గులకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అటు దేశంలో వెండి ధరలు కూడా గురువారం తగ్గాయి. ప్రస్తుతం వంద గ్రాముల వెండి ధర రూ. 9090గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గింది ప్రస్తుతం రూ. 90,900వద్ద కొనసాగుతోంది. బుధవారం ఈ ధర రూ. 91,000గా ఉంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 95,900 పలుకుతోంది. వెండి ధఱలు కోల్ కతాలో రూ. 90,900 బెంగళూరులో రూ. 85,900 పలుకుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories