Interest Rate: తక్కువ వడ్డీరేటులో లోన్‌ కావాలా.. అయితే కచ్చితంగా ఈ విషయాలు మరిచిపోవద్దు..!

To Keep the interest Rate Low While Taking a Loan Keep these Things in Mind
x

Interest Rate: తక్కువ వడ్డీరేటులో లోన్‌ కావాలా.. అయితే కచ్చితంగా ఈ విషయాలు మరిచిపోవద్దు..!

Highlights

Interest Rate: తక్కువ వడ్డీరేటులో లోన్‌ కావాలా.. అయితే కచ్చితంగా ఈ విషయాలు మరిచిపోవద్దు..!

Interest Rate: హోమ్‌లోన్‌, కారులోన్‌, పర్సనల్‌ లోన్‌ తక్కువ వడ్డీకే తీసుకోవాలంటే ముందుగా మీ సిబిల్‌ స్కోర్ మెరుగ్గా ఉండటం అవసరం. సిబిల్‌ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే రుణం ఇచ్చే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ అంతగా మిమ్మల్ని నమ్ముతుంది. సాధారణంగా 700 కంటే ఎక్కువ సిబిల్‌ స్కోర్ మంచి స్కోరుగా చెబుతారు. అయితే మీ సిబిల్‌ స్కోర్‌ని మెరుగుపరుచుకోవచ్చు. దీని కోసం కొన్ని ప్రత్యేక విషయాలను జాగ్రత్తగా గమనించాలి. వాటి గురించి తెలుసుకుందాం.

మీరు ఇప్పటికే రుణం తీసుకున్నట్లయితే దాని ఈఎంఐని సకాలంలో చెల్లించండి. మంచి సిబిల్‌ స్కోర్‌ను మెయింటన్‌ చేయడానికి సరైన సమయానికి ఈఎంఐలని చెల్లించడం అవసరం. ఇలా చేయకపోతే సిబిల్‌ స్కోర్ తగ్గుతుంది. భవిష్యత్తులో లోన్ పొందడం కష్టం అవుతుంది. అందుకే రుణం తీసుకోవడానికి సిబిల్‌ స్కోర్‌ను మెరుగ్గా ఉంచుకోవడం ముఖ్యం. కొత్త రుణం తీసుకోవాల్సి వస్తే అంతకు ముందు పాత రుణాలను తిరిగి చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది మీ మొత్తం ఆదాయంలో రుణ చెల్లింపు వాటాను తగ్గిస్తుంది.

మీ ఆదాయంలో ఎక్కువ భాగం రుణ చెల్లింపుల కోసం ఖర్చవుతుంటే ఆర్థిక సంస్థలు కొత్త రుణం ఇవ్వడానికి ఇష్టపడవు. కానీ మీరు పాత రుణాలన్నింటినీ సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ రేటింగ్ మెరుగ్గా ఉంటుంది. కొత్త రుణాలు తీసుకోవడం సులభం అవుతుంది. క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే దానిలో ఇచ్చిన మొత్తం క్రెడిట్ పరిమితిని ఉపయోగించవద్దు. మీరు లోన్ రీపేమెంట్ కోసం సుదీర్ఘ కాల వ్యవధి ఎంపికను ఎంచుకుంటే ఈఎంఐ తగ్గుతుంది. మీరు దీనిని క్రమం తప్పకుండా చెల్లించడం సులభం అవుతుంది.

లోన్ మొత్తంతో పోలిస్తే ఆదాయం ఎక్కువగా లేకుంటే దీర్ఘకాలిక లోన్ రీపేమెంట్ ఆప్షన్‌ని ఎంచుకోవడం వల్ల సిబిల్‌ రేటింగ్‌ను మెరుగుపరచుకోవచ్చు. ఒకేసారి అనేక రుణాలు తీసుకోవడం క్రెడిట్ రేటింగ్‌కు మంచిది కాదు. సులభంగా తిరిగి చెల్లించగలిగేంత రుణం తీసుకుంటే మంచిది. మీరు చాలా ఎక్కువ రుణాలు తీసుకుంటే వారి వాయిదాలను సకాలంలో చెల్లించడం కష్టం అవుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్‌పై చెడు ప్రభావం చూపుతుంది.

మీ సామర్థ్యానికి మించి రుణం తీసుకోవడం సిబిల్‌ రేటింగ్‌కు మంచిది కాదు. కానీ మీరు ఇంతకు ముందెన్నడూ రుణం తీసుకోకపోతే క్రెడిట్ చరిత్ర ఉండదు. ఈ పరిస్థితిలో మీ రేటింగ్‌ను నిర్ణయించడానికి సరైన ఆధారం ఉండదు. అందుకే సిబిల్‌ రేటింగ్ కోసం కొంత క్రెడిట్ హిస్టరీని కలిగి ఉండటం మంచిది. అంటే రాబోయే రోజుల్లో గృహ రుణం లేదా కారు లోన్ వంటి పెద్ద రుణాన్ని తీసుకోవాల్సి వస్తే దాని కంటే ముందు కొన్ని చిన్న రుణాలు తీసుకోవడం వల్ల మీ క్రెడిట్ చరిత్ర ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories