Multibagger Share: రూ.లక్ష పెట్టుబడిని.. రూ.4లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఏడాదిలోనే కళ్లు చెదిరే లాభాలు..!
Titagarh Wagons Limited Share Price: భారతీయ రైల్వేల కోసం కోచ్‌లను తయారు చేసే టిటాగర్ వ్యాగన్స్ లిమిటెడ్ స్టాక్ గత ఏడాది కాలంలోనే అద్భుతాలు చేసింది.
Titagarh Wagons Limited Share Price: భారతీయ రైల్వేల కోసం కోచ్‌లను తయారు చేసే టిటాగర్ వ్యాగన్స్ లిమిటెడ్ స్టాక్ గత ఏడాది కాలంలోనే అద్భుతాలు చేసింది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ పెట్టుబడిదారులకు అద్భుతమైన ప్రయోజనాలను అందించింది. మంగళవారం ముగిసిన ట్రేడింగ్ సెషన్‌లో ఈ షేరు ఆల్ టైమ్ హై రూ.498.40కి చేరుకుంది. జూన్ 20, 2022న, ఈ షేర్ 52 వారాల కనిష్ట స్థాయి రూ.93.35 వద్ద ఉంది. అంటే, ఈ స్టాక్ ఒక సంవత్సరంలో 400% కంటే ఎక్కువ పెరిగింది.
గత ఏడాది కాలంలో ఈ షేరు రూ.93.35 నుంచి రూ.498.40 వరకు పెరిగింది. అంటే ఏడాది కిందట ఈ షేర్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసేవారు ఈరోజు రూ.4 లక్షలకు యజమానిగా మారేవారు. అతి తక్కువ సమయంలోనే ఈ స్టాక్ పెట్టుబడిని నాలుగు రెట్లు పెరిగింది. గత మూడేళ్లలో ఈ స్టాక్ 1241% బలమైన ర్యాలీని చవిచూసింది. జూన్ 19, 2020న స్టాక్ రూ.36.05 వద్ద ముగిసింది. ఈ సమయంలో రూ.498.40కి చేరింది.
ప్రస్తుత సంవత్సరంలోనే స్టాక్ 100 శాతం కంటే ఎక్కువ లాభపడింది..
సాంకేతిక పరంగా, ఈ స్టాక్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI) 84.9 వద్ద ఉంది. ఇది ఈ స్టాక్ ఓవర్‌బాట్ జోన్‌లో ట్రేడ్ అవుతుందని సూచిస్తుంది. ప్రస్తుత సంవత్సరంలో ఈ స్టాక్ 116%, ఒక నెలలో 46.81% లాభపడింది. వ్యాగన్ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న టిటాగర్ రైల్ సిస్టమ్స్ భారతదేశంలోని ప్యాసింజర్ రైలు వ్యవస్థల కొన్ని సమగ్ర తయారీదారులలో ఒకటిగా నిలిచింది.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం గత పనితీరును బట్టి అందించాం. అయితే, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి అనేది రిస్క్‌తో కూడుకున్నది. నిపుణుల సలహాలు తీసుకుని, సరైన నిర్ణయం తీసుకుని నష్టాల నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది)
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire