Easy Loan: లోన్‌ పొందడానికి 3 సులువైన మార్గాలు.. అవేంటంటే..?

Three Easy Ways to Get a Loan Debt on gold FD Loan Insurance Policy Loan
x

Easy Loan:లోన్‌ పొందడానికి 3 సులువైన మార్గాలు.. అవేంటంటే..?

Highlights

Easy Loan: లోన్‌ పొందడానికి 3 సులువైన మార్గాలు.. అవేంటంటే..?

Easy Loan: మీకు అత్యవసరంగా డబ్బు అవసరంపడితే ఏం చేస్తారు.. ఏ ఫ్రెండ్‌ లేదా తెలిసిన వారిని అడుగుతారు. అక్కడ కూడా డబ్బు దొరకకపోతే చివరికి లోన్‌ గురించి ఆలోచిస్తారు. ఈ రోజుల్లో బ్యాంకుల ఆకర్షనీయమైన పర్సనల్‌ లోన్‌ ఆఫర్లని అందిస్తున్నాయి. అయితే వడ్డీ కూడా ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. మీరు సులువుగా లోన్‌ పొందడానికి మూడు మార్గాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

బంగారంపై రుణం

గోల్డ్ లోన్ కొత్త విషయం కానప్పటికీ చాలా మంది దీనిని పట్టించుకోరు. ఇంట్లో ఉండే నగలు, గోల్డ్ తో బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో చాలా గోల్డ్‌ లోన్‌ కంపెనీలు ఉన్నాయి. మంచి రేటుకు రుణాలు మంజూరుచేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం బంగారంపై మీరు గరిష్టంగా 75 శాతం విలువలో రుణాన్ని పొందవచ్చు.

ఎఫ్డీపై లోన్

చాలా మంది వ్యక్తులు డబ్బు అవసరమైనప్పుడు వారి ఎఫ్డీని విత్‌ డ్రా చేయాలని ప్రయత్నిస్తారు. కానీ మీరు అలా చేస్తే దానికి కొంత ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు సంవత్సరాలుగా దాచుకున్న నిధిని విత్ డ్రాతో ముగింపు పలికినట్టవుతుంది. ఈ పరిస్థితిలో మీకు కావాలంటే ఎఫ్డీపై లోన్ తీసుకునే సౌకర్యం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే సూపర్‌గా ఉంటుంది.

బీమా పాలసీపై రుణం

బీమా పాలసీ మీ జీవితాన్ని రక్షించడమే కాదు అవసరమైనప్పుడు బీమా పాలసీపై రుణం కూడా తీసుకోవచ్చు. బీమా సరెండర్ విలువలో 90 శాతం వరకు రుణం పొందడానికి చాన్స్ ఉంటుంది. దీనిపై 10 శాతం వడ్డీ చెల్లించాలి. మీకు డబ్బు అవసరమైతే మీ బీమా పాలసీని ఉపయోగించుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories