LIC: ఎల్ఐసీ కస్టమర్లకి గమనిక.. పాలసీ ఎప్పుడు సరెండర్‌ చేస్తే నష్టం తప్పుతుంది..!

This is the Easiest way to Close Your LIC Policy Surrender Like This Before Maturity
x

LIC: ఎల్ఐసీ కస్టమర్లకి గమనిక.. పాలసీ ఎప్పుడు సరెండర్‌ చేస్తే నష్టం తప్పుతుంది..!

Highlights

LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ.

LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఇది అన్ని రకాల వర్గాలకి పాలసీలని రూపొందిస్తుంది. కానీ చాలా సార్లు ప్రజలు ఎల్‌ఐసీ లాభనష్టాలని భేరీజు వేయకుండా పాలసీ కొనుగోలు చేస్తారు. తరువాత పశ్చాత్తాపడి పాలసీని క్లోజ్‌ చేయాలనుకుంటారు. దీనివల్ల చాలా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఎల్‌ఐసీ పాలసీ ఎప్పుడు సరెండర్‌ చేయాలో తెలుసుకుందాం.

ఒక్కోసారి పాలసీ మెచ్యూరిటీకి ముందే దాని నుంచి నిష్క్రమించే పరిస్థితులు తలెత్తుతాయి. దీని కోసం వినియోగదారులు కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి. ఎల్‌ఐసీ పాలసీని సరెండర్ చేసిన తర్వాత కంపెనీ, కస్టమర్ మధ్య ఒప్పందం ముగుస్తుంది. మెచ్యూరిటీకి ముందు సరెండర్ చేయడం వల్ల పాలసీ మొత్తం విలువ తగ్గుతుంది. కనీసం 3 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించిన తర్వాత మాత్రమే పాలసీని సరెండర్ చేయాలి. అయితే మూడేళ్లలోపు లొంగిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు.

మూడేళ్ల తర్వాత గ్యారెంటీడ్ సరెండర్ విలువ కింద కస్టమర్‌లు చెల్లించిన ప్రీమియం, ప్రమాదవశాత్తు ప్రయోజనాల కోసం చెల్లించిన ప్రీమియం మినహా కంపెనీ నుంచి 30 శాతం డబ్బును పొందుతారు. పాలసీని ఎంత ఆలస్యంగా సరెండర్ చేస్తే అంత ఎక్కువ డబ్బు అందుతుంది. దీని గురించి మరింత సమాచారం పొందడానికి మీరు https://www.licindia.in/ని సందర్శించవచ్చు. ఇక్కడ అన్ని వివరాలని తెలుసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories