Insurance Sector: ఇన్సూరెన్స్ సెక్టార్‌లో పెద్ద మార్పులు.. తెలుసుకోపోతే భారీ నష్టం..!

These Big Changes in the Insurance Sector Customers Need to be Aware of and May Lose out
x

Insurance Sector: ఇన్సూరెన్స్ సెక్టార్‌లో పెద్ద మార్పులు.. తెలుసుకోపోతే భారీ నష్టం..!

Highlights

Insurance Sector: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది.

Insurance Sector: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ తేదీ నుంచి అనేక విషయాలలో మార్పులు జరిగాయి. ముఖ్యంగా బీమా రంగంలో పెను మార్పులు సంభవించాయి. కొన్ని రకాల బీమా ప్రీమియంలపై పన్ను రాయితీని రద్దు చేశారు. ఇది కాకుండా బీమా సంబంధిత ఖర్చులు, కమీషన్ పరిమితిలో మార్పులు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మారిన నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఈ ఏడాది నుంచి కస్టమర్లు ఎక్కువ ప్రీమియం ఉండే పాలసీల్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇటువంటి పాలసీలపై ఎలాంటి పన్ను ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఐదు లక్షల ప్రీమియంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంది. అయితే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లని (యులిప్‌లు) ఈ కొత్త ఆదాయపు పన్ను నిబంధన నుంచి మినహాయించారు. సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న యులిప్ ప్రీమియంలపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి.

ఇన్సూరెన్స్ ఏజెంట్ల మార్పులు

ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ (IRDAI) మెయింటెన్స్‌ ఖర్చులు, కమీషన్ పరిమితిని మార్చింది. బీమా ఏజెంట్లు లేదా అగ్రిగేటర్లపై కమీషన్ పరిమితిని తొలగించాలని IRDA నిర్ణయించింది. మొత్తం వ్యయంలో కమీషన్‌ను 20 శాతానికి పరిమితం చేయాలని గతంలో ఐఆర్‌డిఎ ప్రతిపాదించింది. కానీ ఈ పరిమితిని తొలగించారు. ఇప్పుడు బీమా కంపెనీలు వారి కోరిక మేరకు కమీషన్ మొత్తాన్ని నిర్ణయించవచ్చు.

బీమా రంగంలో ఏర్పడిన కొత్త మార్పులని గమనించడం అవసరం. ఈ ఆర్థిక సంవత్సరంలో బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు అన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. పన్ను రాయితీల రద్దు, మెయింటనెన్స్‌ ఖర్చులు, కమీషన్‌పై పరిమితిలో మార్పులని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. బీమా సుగమ్‌ను ప్రవేశపెట్టడంతో వినియోగదారులు బీమా అవసరాల కోసం ఒకే ప్లాట్‌ఫారమ్‌ ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories