Post Office Schemes: ప్రభుత్వ బ్యాంకుల కన్నా కూడా ఎక్కువ వడ్డీ అందించే పోస్టాఫీసు స్కీములు ఇవే

These are the post office schemes that offer higher interest rates than government banks
x

Post Office Schemes: ప్రభుత్వ బ్యాంకుల కన్నా కూడా ఎక్కువ వడ్డీ అందించే పోస్టాఫీసు స్కీములు ఇవే 

Highlights

Post Office Schemes: పోస్టల్ బ్యాంకులో అందిస్తున్న ముఖ్యమైన మూడు పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు బ్యాంకుల కన్నా కూడా ఎక్కువ వడ్డీ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

Post Office Schemes:మన దేశంలో ఎన్ని బ్యాంకులు ఉన్నప్పటికీ.. ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ.. స్టాక్ మార్కెట్ బంగారం రియల్ ఎస్టేట్ ఇలా ఎన్ని రకాల పెట్టుబడి సాధనాలు ఉన్నప్పటికీ.. ప్రజలు మాత్రం నమ్మే ఏకైక సాధనం పోస్ట్ ఆఫీస్ చిన్న మొత్తాల పథకాలు అని చెప్పవచ్చు.అవును మీరు వింటున్నది నిజమే. పోస్ట్ ఆఫీస్ వారు అందించే పలు స్కీములు ప్రజలను చాలా దశాబ్దాలుగా ఆకర్షిస్తూనే ఉన్నాయి.ఎన్ని ప్రైవేట్ బ్యాంకులు వచ్చినా, ఎన్ని ఫైనాన్స్ కంపెనీలు వచ్చిన ప్రజలకు మాత్రం పోస్ట్ ఆఫీసులపై ఏమాత్రం నమ్మకం సన్నగిల్లడం లేదు. దీనికి ప్రధాన కారణం పోస్ట్ ఆఫీసులు భారత ప్రభుత్వం నడపడమే. నేరుగా కేంద్ర ప్రభుత్వమే మీకు గ్యారెంటీగా ఉంటుంది. దీంతో ప్రతి ఒక్కరు భేషుగ్గా పోస్ట్ ఆఫీస్ లో తమ డబ్బులు దాచుకునేం దుకు ఏమాత్రం సందేహించరు. పోస్ట్ ఆఫీసులు అనేక రకాల స్కీములను ప్రవేశపెడుతూ ఉంటాయి. వీటిలో చాలా స్కీములు తమ కస్టమర్లకు గ్యారెంటీ రిటర్న్స్ ను అందిస్తూ ఉంటాయి.మీరు గనుక పోస్ట్ ఆఫీస్ లో మంచి పథకాల కోసం చూస్తున్నట్లయితే పలు లాంగ్ టర్మ్ డిపాజిట్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పోస్టల్ బ్యాంకులో అందిస్తున్న ముఖ్యమైన మూడు పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు బ్యాంకుల కన్నా కూడా ఎక్కువ వడ్డీ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీం అనేది మహిళల్లో పొదుపును ప్రోత్సహించేందుకు సూచించిన ఒక పథకం. ఈ పథకం ద్వారా మీరు రెండు సంవత్సరాల కాలం వ్యవధికి గాను ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. ఇందులో సంవత్సరానికి 7.5% వడ్డీ అందిస్తారు. ఇతర పథకాలతో పోల్చి చూసినట్లయితే ఇది చాలా ఎక్కువ అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల సైతం ఈ స్థాయిలో వడ్డీని అందించడం లేదు మీరు ఈ స్కీంలో కనీసం రూ. 1000 నుంచి రూ. 2 లక్షల రూపాయల వరకు డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఒక లక్ష రూపాయలకుగాను రెండు సంవత్సరాల అనంతరం సుమారు రూ.1,16,000 రూపాయలు పొందే వీలుంది.

నేషనల్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్ స్కీం: పోస్ట్ ఆఫీస్ లో నేషనల్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్ స్కీం కింద మీరు డబ్బులను పొదుపు చేసినట్లయితే, మీకు బయట ప్రైవేటు వడ్డీల కన్నా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు లభిస్తుంది. ఈ స్కీములో మీకు గరిష్టంగా 7.5% వరకు వడ్డీ లభించే అవకాశం ఉంది.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం: ఈ స్కీములో సీనియర్ సిటిజన్స్ పొదుపు చేసుకోవచ్చు ఈ స్కీము పై కూడా అత్యధిక మొత్తంలో వడ్డీ లభిస్తుంది. ఇందులో మీరు గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిపై వడ్డీ రేటు 8.2 % గా ఉంది. ఉదాహరణకు మీరు రూ. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత 1,41,000 రూపాయలు మీకు లభిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories