New Rules: వచ్చేనెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..సామాన్యులకు ఆర్థిక భారం తప్పదేమో

New Rules: వచ్చేనెల నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..సామాన్యులకు ఆర్థిక భారం తప్పదేమో
x
Highlights

New Rules: ఈ ఏడాది పూర్తవ్వడానికి ఇంకా నెల మాత్రమే మిగిలింది. నవంబర్ నెల పూర్తయి డిసెంబర్ నెల రానుంది. డిసెంబర్ నెల పూర్తవ్వడంతో కొత్త సంవత్సరంలోకి...

New Rules: ఈ ఏడాది పూర్తవ్వడానికి ఇంకా నెల మాత్రమే మిగిలింది. నవంబర్ నెల పూర్తయి డిసెంబర్ నెల రానుంది. డిసెంబర్ నెల పూర్తవ్వడంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాం. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి దేశంలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. అవేంటో చూద్దాం.

డిసెంబర్ 1, 2024 నుంచి దేశంలోని చాలా రూల్స్ రాబోతున్నాయి. ఎల్పీజీ ధరల నుంచి క్రెడిట్ కార్డు నిబంధనల వరకు వీటిలో ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి ఈసారి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి..ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతినెల మాదిరిగానే డిసెంబర్ నెల కూడా ఎన్నో పెద్ద మార్పులను తీసుకురాబోతోంది. ఈ మార్పులు మొదటి తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. అలాగే మన ఆర్థిక స్థితిపై కూడా ప్రభావం చూపనున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, క్రెడిట్ కార్డు నిబంధనలతో పాటు అనేక మార్పులు జరుగుతాయి.

సాధారణంగా ప్రభుత్వం ప్రతినెల 1వ తేదీన ఎల్పీజీ ధరను మారుస్తూ ఉంటుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు, ఎల్పీజీ ధరల్లో మార్పులు కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో ఈసారి కూడా ఎల్పీజీ సిలిండర్ ధరలో మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అక్టోబర్ నెలలో గ్యాస్ కంపెనీలు, 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 48 పెంచాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు మళ్లీ బిగ్ షాక్ ఇవ్వనుంది. ఎస్బిఐ కార్డు వెబ్ సైట్ ప్రకారం డిసెంబర్ 1, 2024 నుంచి దాని క్రెడిట్ కార్డులు డిజిటల్ గేమింగ్ ఫ్లాట్ ఫామ్స్ , బిజినెస్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పై రివార్డులు పాయింట్స్ ను ఇవ్వవు.

ఇక అటు డిసెంబర్ లో బ్యాంకుల 17 రోజుల పాటు మూతపడనున్నాయి. డిసెంబర్ లో మిగిలి ఉన్న పనికోసం బ్రాంచ్ కు వెళ్లే ముందు బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories