Business Idea: ఈ బిజినెస్‌కు ఎప్పుడూ డిమాండ్‌.. ఉద్యోగులు కూడా చేయవచ్చు..!

There is Always a Demand for Spices Business there is No Loss at All
x

Business Idea: ఈ బిజినెస్‌కు ఎప్పుడూ డిమాండ్‌.. ఉద్యోగులు కూడా చేయవచ్చు..!

Highlights

Business Idea: చాలామందికి బిజినెస్‌ చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ కొంతమంది పెట్టుబడి లేనందున ప్రారంభించలేకపోతారు.

Business Idea: చాలామందికి బిజినెస్‌ చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ కొంతమంది పెట్టుబడి లేనందున ప్రారంభించలేకపోతారు. మరికొంతమంది నష్టం వస్తుందనే భయంతో ప్రారంభించరు. అయితే మార్కెట్‌లో అవసరానికి అనుగుణంగా ఉండే వ్యాపారం చేస్తే నష్ట భయం అస్సలే ఉండదు. అలాంటి బిజినెస్‌లు తక్కువగా ఉంటాయి. అందులో ఒకటి మసాల దినుసుల వ్యాపారం. ఈ వ్యాపారంలో నష్టమనే మాటే ఉండదు. కష్టపడితే మంచి లాభాలు సంపాదించవచ్చు. దీని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

భారతదేశంలో మసాలా దినుసులకు చాలా డిమాండ్‌ ఉంటుంది. ప్రతీ రోజూ వంటింట్లో ఉపయోగించే మసాలాల వ్యాపారం చేస్తే అసలు నష్టం అనేదే ఉండదు. అంతేకాకుండా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మసాలా తయారీ యూనిట్‌ ప్రారంభించడానికి ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు నిత్యం ఆదాయం పొందొచ్చు. సుంగధ ద్రవ్యాలకు ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవచ్చు.ఇందుకోసం పెద్దగా స్థలం కూడా అవసరం లేదు ఇంట్లోనే ఓ గది ఉంటే చాలు.

సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు రూ. 3.5 లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించవచ్చు. 300 చదరపు అడుగుల ఓ గదితో పాటు ముడి సరకులు ఉంటే చాలు. ఇక పెట్టుబడి కోసం టెన్షన్‌ పడాల్సిన పనిలేదు. బ్యాంకులు సైతం లోన్స్‌ ఇస్తున్నాయి. ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద లోన్‌ పొందొచ్చు. అంతేకాకుండా ముద్రలోన్‌ ద్వారా కూడా రుణం తీసుకొని బిజినెస్ ప్రారంభించవచ్చు. తక్కువలో తక్కువ నెలకు రూ. 30 వేలకిపైగా సంపాదించొచచు.

Show Full Article
Print Article
Next Story
More Stories