స్టూడెంట్ అకౌంట్‌ వల్ల చాలా ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు..!

There are Many Benefits of Student Bank Account you will be Shocked to Know
x

స్టూడెంట్ అకౌంట్‌ వల్ల చాలా ప్రయోజనాలు.. తెలిస్తే షాక్ అవుతారు..!

Highlights

Student Bank Account: చాలా మంది పిల్లలు డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి పిగ్గీ బ్యాంకును ఉపయోగిస్తారు.

Student Bank Account: చాలా మంది పిల్లలు డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి పిగ్గీ బ్యాంకును ఉపయోగిస్తారు. అయితే పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ అతనికి ఉన్నత విద్య అవసరం. ఈ సమయంలో బ్యాంకు ఖాతా కచ్చితంగా అవసరమవుతుంది. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు పిల్లల స్టూడెంట్‌ బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

విద్యార్థి బ్యాంకు ఖాతా సాధారణ పొదుపు ఖాతాకు భిన్నంగా ఉంటుంది. వాస్తవానికి ప్రజలు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్స్‌ చేయాలి. కానీ స్టూడెంట్‌ ఖాతాలో అలాంటిది ఏమి అవసరం లేదు. విద్యార్థుల బ్యాంకు ఖాతాలు జీరో బ్యాలెన్స్‌పై పని చేస్తాయి. దీంతో పాటు చాలా మంది విద్యార్థుల బ్యాంకు ఖాతాలు వివిధ బ్యాంకు ATMల వినియోగానికి నెలవారీ రుసుము లేదా అదనపు ఛార్జీలు లేకుండా పనిచేస్తాయి.

విద్యార్థి బ్యాంకు ఖాతాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థుల బ్యాంకు ఖాతాలను సులభంగా తెరవవచ్చు. ఇది కాకుండా డిజిటల్ లావాదేవీలు, స్కాలర్‌షిప్‌లపై వడ్డీ లేని రుణాలు, ఉచిత ప్రోత్సాహకాలు, తగ్గింపులు మొదలైనవి పొందవచ్చు.

1. ఎటువంటి మెయింటనెన్స్‌ ఖర్చు ఉండదు.

2. బ్యాంకు లావాదేవీలు నిర్వహించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.

3. డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు చేసుకోవచ్చు.

4. రుణాలకు వడ్డీ ఉండదు.

5. విద్యా గ్రాంట్లు పొందడంలో సహాయకారిగా పనిచేస్తుంది.

6. ఉచిత రివార్డులు, సౌకర్యాలు లభిస్తాయి.

7. సబ్సిడీ ప్రయోజనాలు అందుతాయి.

8. బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసినప్పుడు ఎటువంటి ఛార్జీలు ఉండవు.

9. అకౌంట్‌ని సేవింగ్స్ ఖాతాకు మార్చుకునే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories