June Bank Holidays 2024: జూన్​లో 12 రోజులు బ్యాంకులకు హాలిడేస్.. ఏ రోజున వస్తున్నాయంటే..!

Bank holidays AP and Telangana for three days
x

Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్..ఏపీ, తెలంగాణలో మూడు రోజులు బ్యాంకులు బంద్

Highlights

June Bank Holidays 2024: మరో రెండు రోజుల్లో మే నెల ముగిసి జూన్​ ప్రారంభంకాబోతుంది.

June Bank Holidays 2024: మరో రెండు రోజుల్లో మే నెల ముగిసి జూన్​ ప్రారంభంకాబోతుంది. దీంతో చాలా విషయాల్లో మార్పులు జరగనున్నాయి. అందులో భాగంగా జూన్​లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వస్తున్నాయి. ఇందులో దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఉండే పండుగలు, రెండో శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. అయితే ఏ రోజుల్లో బ్యాంకు బంద్​ ఉంటుందో తెలిస్తే బ్యాంకుకు సంబంధించిన పనుల గురించి ముందస్తుగా ప్లాన్​ చేసుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. జూన్​లో వచ్చే సెలవుల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

జూన్ 9న హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మహారాణా ప్రతాప్ జయంతి

జూన్​10న పంజాబ్ లో అమరవీరుల దినోత్సవం

జూన్​ 14న పహిలి రాజా కారణంగా ఒడిశాలో బ్యాంకులు బంద్

జూన్​15న YMA డే

జూన్​ 17న బక్రీద్, 21న సావిత్రి వ్రతం ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక సెలువుల కారణంగా బ్యాంకులు బంద్ ఉంటాయి.

జూన్ 8 సెకండ్, జూన్ 22 నాల్గొ శనివారాలు కాబట్టి బ్యాంక్ హాలిడేస్. జూన్ 2, 9, 16, 23, 30 భారతదేశం అంతటా ఆదివారం బ్యాంకులకు సెలవులు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ లో పని ఉంటే ఈ షెడ్యూల్ ఆధారంగా కస్టమర్లు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రతి ఏటా బ్యాంక్ సెలవుల క్యాలెండర్‌ను నిర్ణయిస్తుంది. దీనిని అన్ని బ్యాంకులు అనుసరిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories