Gold Rate Today July 24, 2024: నిర్మలమ్మ మీరు దేవతమ్మా..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

More reduced greenback..What is the balance in Telugu states
x

 Today Gold Price: మరింత తగ్గిన పసిడి..తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే

Highlights

Gold Rate Today July 24, 2024:దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలుఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Rate Today July 24, 2024:దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బంగారం, వెండి పై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బంగారం, వెండిపై 15శాతం ఉన్న కస్టమ్స్ డ్యూటీని 6శాతానికి తగ్గించారు. దీంతో దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ. 75, 334 ఉండగా..బుధవారం నాటికి రూ. 3,950 తగ్గి రూ. 71,384కు చేరింది. మంగళవారం కిలో వెండి ధర రూ. 90, 950ఉండగా..మంగళవారం నాటికి రూ. 3,700 తగ్గింది. దీంతో రూ. 87,250 కి చేరింది.

నేడు హైదరాబాద్​లో 10 గ్రాముల​ బంగారం ధర రూ.71,384గా ఉండగా..కిలో వెండి ధర రూ.87,250 పలుకుతోంది. అటు విజయవాడలో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.రూ.71,384 ఉంటే.. కిలో వెండి ధర రూ.87,250 పలుకుతోంది. ఇక విశాఖపట్నంలో అయితే పది గ్రాముల బంగారం ధర రూ.రూ.71,384గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.87,250గా ఉంది.

ఇక బంగారం ధర ఏకంగా తులంపై రూ. 3వేలు తగ్గడం పసిడి ప్రియులకు కచ్చితంగా శుభవార్తే అని చెప్పవచ్చు. భవిష్యత్తులోనూ బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. నిన్న మొన్నటి వరకుభారీగా పెరిగిన వెండి ధర కూడా నేలచూపు చూస్తోంది. వెండి కిలో ధరపై రూ. 3,500 వరకు తగ్గింది.


Show Full Article
Print Article
Next Story
More Stories