కేంద్రం కీలక ప్రకటన.. ఆ 9 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సిడీ..!

The Government LPG Subsidy is only for the Nine Crore Beneficiaries of the Ujwala Scheme
x

కేంద్రం కీలక ప్రకటన.. ఆ 9 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సిడీ..!

Highlights

*కేంద్రం కీలక ప్రకటన.. ఆ 9 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సిడీ..!

LPG Subsidy: ఉజ్వల పథకం కింద ఉచిత ఎల్‌పిజి కనెక్షన్ పొందిన తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం ఎల్‌పిజి సబ్సిడీని ఇస్తోంది. ఇతర లబ్ధిదారులు మార్కెట్ ధర ప్రకారం ఎల్‌పిజి సిలిండర్ తీసుకోవాలి. జూన్ 2020 నుంచిఎల్‌పిజిపై సబ్సిడీ ఇవ్వడం లేదని పెట్రోలియం కార్యదర్శి పంకజ్ జైన్ ఒక సమావేశంలో తెలిపారు.

ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన సబ్సిడీ మే 21 నుంచి వర్తిస్తుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఒక సంవత్సరంలో 12 గ్యాస్ సిలిండర్‌లపై సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీని సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.1,003గా ఉంది. కానీ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఒక్కో సిలిండర్‌ను బుక్ చేసిన తర్వాత ప్రభుత్వం రూ.200 సబ్సిడీని రిటన్‌ చేస్తుంది. దీంతో సిలిండర్ ధర రూ.803 అవుతుంది.

అయితే ఉజ్వల పథకం కింద నమోదైన తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారులకు మాత్రమే గ్యాస్ సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన 21 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్ హోల్డర్లు మార్కెట్ ధరలకు గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి మాట్లాడుతూ సబ్సిడీ నిర్మాణం కాలక్రమేణా కోతకు గురైందని అన్నారు. ప్రభుత్వం క్రమంగా పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌పై సబ్సిడీని రద్దు చేసింది. జూన్ 2020 నుంచి ఎల్‌పిజిపై కూడా సబ్సిడీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అయితే ఎల్‌పిజి సబ్సిడీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గత ఏడాది కాలంలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.103.50 పెరిగింది. జూన్ 2021లో దీని ధర రూ. 809. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధర పెరిగినప్పటికీ దాని పూర్తి భారం గ్యాస్ వినియోగదారులపై పడడం లేదని మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories