LPG Gas Subsidy: 9 కోట్లమందికి ఎల్పీజి సబ్సిడీ.. మీ పేరు ఆ లిస్టులో ఉందా..!

The Government is Subsidizing 9 Crore People on LPG Find Out How you Can Benefit
x

Lpg Gas Subsidy: 9 కోట్లమందికి ఎల్పీజి సబ్సిడీ.. మీ పేరు ఆ లిస్టులో ఉందా..!

Highlights

LPG Gas Subsidy: 9 కోట్లమందికి ఎల్పీజి సబ్సిడీ.. మీ పేరు ఆ లిస్టులో ఉందా..!

LPG Gas Subsidy: ప్రభుత్వం ఇటీవల ఎల్‌పిజి వంట గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఎల్‌పీజీపై రూ.200 సబ్సిడీని ప్రకటించింది. 9 కోట్ల మందికి ఎల్పీజీపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. మీ ఖాతాలో ఎల్‌పీజీ సబ్సిడీ వస్తుందా లేదా అనేది మీరు సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు అర్హులు అయి ఉండి సబ్సిడీ రాకపోతే మీరు ఫిర్యాదు చేయవచ్చు.

ఖాతాలో సబ్సిడీ ఇలా తనిఖీ చేయండి..?

1. దీని కోసం మీరు www.mylpg.in కి వెళ్లండి .

2. ఇప్పుడు స్క్రీన్ కుడి వైపున గ్యాస్ కంపెనీల గ్యాస్ సిలిండర్ల ఫోటోను చూస్తారు. ఇక్కడ మీ సర్వీస్ ప్రొవైడర్ గ్యాస్ సిలిండర్ ఫోటోపై క్లిక్ చేయండి.

3. తర్వాత మీ గ్యాస్ సర్వీస్ ప్రొవైడర్‌కి చెందిన కొత్త విండో స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.

4. ఇప్పుడు కుడి ఎగువన సైన్-ఇన్, కొత్త వినియోగదారు ఎంపికపై నొక్కండి.

5. ఇప్పటికే మీ IDని ఇక్కడ క్రియేట్‌ చేసి ఉంటే సైన్-ఇన్ చేయండి. మీకు ID లేకపోతే మీరు కొత్త వినియోగదారుని నొక్కడం ద్వారా వెబ్‌సైట్‌కి లాగిన్ చేయవచ్చు.

6. ఇప్పుడు మీ ముందు ఒక విండో ఓపెన్‌ అవుతుంది. కుడి వైపున ఉన్న వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీపై నొక్కండి.

7. మీకు ఏ సిలిండర్‌కు సబ్సిడీ ఇవ్వబడింది. ఎప్పుడు అందించారు అనే సమాచారం లభిస్తుంది.

8 దీంతో పాటు మీరు గ్యాస్ బుక్ చేసి, మీకు సబ్సిడీ మొత్తం అందకపోతే మీరు ఫీడ్‌బ్యాక్ బటన్‌పై క్లిక్ చేయవచ్చు.

9. ఇప్పుడు మీరు సబ్సిడీ డబ్బు అందకపోవడంపై ఫిర్యాదు చేయవచ్చు.

10. ఇది కాకుండా మీరు ఉచితంగా ఈ టోల్ ఫ్రీ నంబర్ 18002333555కి కాల్ చేయడం ద్వారా ఫిర్యాదును నమోదు చేయవచ్చు.

సబ్సిడీ ఎందుకు ఆగిపోతుంది?

మీకు సబ్సిడీ రాకపోతే ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవడం ముఖ్యం. వాస్తవానికి LPGపై సబ్సిడీని నిలిపివేయడానికి అతిపెద్ద కారణం LPG ఆధార్ లింకింగ్ చేయకపోవడం. ఇది కాకుండా వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి సబ్సిడీ ఇవ్వరని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories