Diwali Season 2023: పండుగ సీజన్‌ మొదలైంది.. చాలామంది డబ్బుని ఇలా వృథా చేస్తున్నారు..!

The Festival Season has Started Many are Wasting Money Like This
x

Diwali Season 2023: పండుగ సీజన్‌ మొదలైంది.. చాలామంది డబ్బుని ఇలా వృథా చేస్తున్నారు..!

Highlights

Diwali Season 2023: దేశంలోనే అతిపెద్ద పండుగ దీపావళి వచ్చే వారం రాబోతోంది. అందుకు జనం ఏర్పాట్లో నిమగ్నులు అయ్యారు. దీపావళికి ముందు ప్రజలు ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనడానికి షాపింగ్ చేస్తారు.

Diwali Season 2023: దేశంలోనే అతిపెద్ద పండుగ దీపావళి వచ్చే వారం రాబోతోంది. అందుకు జనం ఏర్పాట్లో నిమగ్నులు అయ్యారు. దీపావళికి ముందు ప్రజలు ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనడానికి షాపింగ్ చేస్తారు. ప్రతి సంవత్సరంలాగే ఈ దీపావళికి కూడా చాలా ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ పండుగ సీజన్‌లో ప్రజలు ఎక్కువగా ఏ వస్తువులు కొంటున్నారో తెలుసా.. ఒక నివేదిక ప్రకారం ఈ పండుగ సీజన్‌లో ప్రజలు ఏసీ, ఫ్రిజ్, వాషింగ్‌ మెషీన్‌, కార్ల లాంటి లగ్జరీ వస్తువుల కొనడానికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.

కొనుగోళ్లు బాగా పెరిగాయి

వినియోగదారుల డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ యాక్సిస్ మై ఇండియా నివేదికలో ప్రజల కొనుగోలు విధానాలు, ఖర్చుల గురించి వివరించారు. ఈ నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాల గృహ వ్యయంలో పెరుగుదల ఉంది. దాదాపు 60 శాతం మంది అనవసర, గృహోపకరణాల కోసం ఖర్చు చేస్తున్నారని తేలింది. ఇది గత నెల కంటే 7 శాతం ఎక్కువ. ఈ సమయంలో ప్రజలు ఉదారంగా ఖర్చు చేస్తున్నారని నివేదిక చెబుతోంది.

ఈ వస్తువులు అత్యధికంగా అమ్ముడవుతున్నవి

దీపావళి పండుగ దగ్గర పడుతున్న కొద్దీ ఖర్చు పెట్టేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నట్లు మై యాక్సిస్ సూచీలో పేర్కొంది. ప్రజలు ఏ వస్తువు కొనాలన్నా ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు. స్వేచ్ఛగా ఖర్చు చేయడానికి ఇష్టపడతున్నారు. ఈసారి బ్రాండెడ్ దుస్తులు, ఫ్యాషన్ వస్తువులను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. 67 శాతం మంది ఫ్యాషన్, దుస్తుల కోసం ఖర్చు చేస్తున్నారు.

వీటిపై ఖర్చు బాగా పెరిగింది

నివేదిక ప్రకారం 44 శాతం కుటుంబాల వ్యక్తిగత సంరక్షణ, గృహోపకరణాల వంటి అవసరమైన వాటిపై ఖర్చు పెరిగింది. ఇది గత నెల కంటే 1 శాతం ఎక్కువ. అయితే 8 శాతం కుటుంబాలకు ఏసీ, ఫ్రిజ్, కారు వంటి అనవసర వస్తువులపై ఖర్చు పెరిగింది. అదే సమయంలో 37 శాతం కుటుంబాల ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన విషయాలపై ఖర్చు పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories