RBI: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీరేట్లు యథాతథం

The Current Repo Rate as Fixed by the RBI is 6.50%
x

RBI: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీరేట్లు యథాతథం

Highlights

RBI: అవరసమైనప్పుడు వడ్డీరేట్లను సమీక్షిస్తామన్న శక్తికాంతాదాస్

RBI: RBI మానిటరీ పాలసీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ శక్తికాంతాదాస్ కొత్త ఆర్ధిక సంవత్సర రెపో రేట్లను నిర్ణయించారు. గతేడాది 4 శాతం నుంచి 6.50 శాతానికి రెపోరేటును పెంచిన RBI...ఈ ఏడాది కూడా అదే రెపో రేటును యధాతధంగా ప్రకటించింది. అంతేకాకుండా అవసరైనప్పుడు వడ్డీ రేట్లపై సమీక్షిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతాదాస్ తెలిపారు. 2022-23లో జీడీపీ 7శాతం పెరిగిందని, ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉన్నాయని, అయితే ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగుతుందని గవర్నర్ అన్నారు. గ్లోబల్ ఎకానమీ అల్లకల్లోలాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఏప్రిల్-జూన్ 2023లో జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసినట్లు శక్తికాంత దాస్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories