Bajaj CNG: అదిరిపోతున్న రెస్పాన్స్.. పెరగనున్న బజాజ్ CNG ఉత్పత్తి..!

Bajaj CNG
x

Bajaj CNG 

Highlights

Bajaj CNG: బజాజ్ ఫ్రీడమ్ 125 సిఎన్‌జి బైక్ తయారీ సామర్థ్యాన్ని ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి 10,000 యూనిట్లకు పెంచేందుకు కంపెనీ కృషి చేస్తోంది.

Bajaj CNG: ప్రపంచంలోనే తొలి CNG బైక్‌కు కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. అందువల్ల, ప్రస్తుతం బజాజ్ ఆటో తన ఉత్పత్తిని పెంచాలని ఆలోచిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి బజాజ్ ఆటో తన సిఎన్‌జి బైక్‌ల తయారీని నెలకు 20,000 యూనిట్లకు పెంచేందుకు సిద్ధమవుతోందని సిఎన్‌బిసి-టివి18 వర్గాలు తెలిపాయి.

ఫ్రీడమ్ 125 సిఎన్‌జి బైక్ తయారీ సామర్థ్యాన్ని ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి 10,000 యూనిట్లకు పెంచేందుకు కంపెనీ ప్రస్తుతం కృషి చేస్తోంది. గతంలో బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌ను జూలై 5న విడుదల చేసింది. కంపెనీ ఇప్పటి వరకు ఈ బైక్‌ను 1,600 యూనిట్లను వినియోగదారులకు విక్రయించింది.

బజాజ్ ఫ్రీడమ్ 125 అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి CNG ఇంటిగ్రేటెడ్ బైక్. ఇది మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 95,000 (ఎక్స్-షోరూమ్). కంపెనీ ప్రకారం ఫ్రీడమ్ 125 మెయింట్‌నెస్ ఖర్చులను 50 శాతం తగ్గిస్తుంది. ఇది 330 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. బైక్ CNG సిలిండర్, రెండు-లీటర్ పెట్రోల్ ట్యాంక్‌తో డ్యూయల్ ఫ్యూయల్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత బజాజ్ ఆటో CNG బైక్‌ల తయారీ సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలో ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఒక నెల క్రితం బైక్‌లను ప్రారంభించినప్పటి నుండి, బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125 కోసం 60,000 ఎంక్వేరీలు, 13,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది. ఆగస్టు నెలలో కంపెనీ 5,000 యూనిట్ల CNG బైక్‌ల రిటైల్ విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుంది.

బజాజ్ ఆటో ప్రస్తుతం భారతదేశం అంతటా CNG బైక్‌ల రిటైల్ విక్రయాలను పెంచడానికి కృషి చేస్తోంది. ప్రస్తుతం, ఫ్రీడమ్ 125 మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ-NCRలోని 111 నగరాల్లో 86లో అందుబాటులో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బైక్ విక్రయాలను ప్రోత్సహించాలని బజాజ్ ఆటో భావిస్తోంది.

జూలై 2024లో బజాజ్ ఆటో మొత్తం 3,54,169 యూనిట్లను విక్రయించగా, జూలై 2023లో ఈ సంఖ్య 3,19,747గా ఉంది. ఇది 11 శాతం పెరుగుదల. ద్విచక్ర వాహనాల విక్రయాలు దేశీయ మార్కెట్లో 18 శాతం, ఎగుమతుల్లో 2 శాతం పెరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories