PAN Card: మీకు పాన్ కార్డ్ ఉందా? అయితే వెంటనే ఈ పనిచేయండి..లేదంటే?

PAN Card: మీకు పాన్ కార్డ్ ఉందా? అయితే వెంటనే ఈ పనిచేయండి..లేదంటే?
x
Highlights

PAN Card: పాన్ కార్డు ఇప్పుడు కొన్ని పనులకు తప్పనిసరిగా మారిపోయింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు చేయాలంటే పాన్ కార్డులు ఉండాలి. ఈ పాన్ కార్డుకు...

PAN Card: పాన్ కార్డు ఇప్పుడు కొన్ని పనులకు తప్పనిసరిగా మారిపోయింది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు చేయాలంటే పాన్ కార్డులు ఉండాలి. ఈ పాన్ కార్డుకు సంబంధించి మరో కీలక నిర్ణయంత తీసుకుంది కేంద్రం. 10 డిజిట్ ఆల్ఫా న్యూమరికల్ నంబర్ ను కలిగే ఉండే పాన్ కార్డు..ఫైనాన్షియల్ ఐడీ కార్డుగా పనికొస్తుంది. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం నుంచి బ్యాంకింగ్ సర్వీసులకు , పన్ను చెల్లింపులకు, పెట్టుబడులకు పాన్ కార్డు ఉండాల్సిందే. అయితే పాన్ కార్డును ఆధార్ తో లించే చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేసింది.

డూప్లికేట్ పాన్ కార్డులను నివారించడంతోపాటు , ట్యాక్స్ ఫైలింగ్ ను మరింత సులభం చేయడానికి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లతో పారదర్శకతను తీసుకువచ్చేందుకు పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ ను కేంద్ర ప్రభుత్వ తప్పనిసరి చేసింది. ఈ ప్రాసెస్ చేసేందుకు ఎన్నోసార్లు గడువు తేదీని కూడా పొడిగించింది. చివరిసారిగా 2024 మే 31వ తేదీని లాస్ట్ డేట్ గా ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ ఎక్స్ టెండ్ చేయలేదు. అయితే ఇప్పటి వరకు ఆధార్, పాన్ లింక్ చేయనివాళ్లు ఇప్పుడు కూడా చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. రూ. 1000 పెనాల్టీతో ఆధార్ పాన్ కార్డ్ లింక్ చేసుకోవచ్చు.

ఆధార్ తో పాన్ లింక్ చేయకపోతే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొవల్సి వస్తుంది. ముఖ్యంగా ట్యాక్స్ ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. గడువు ముగిసే లోపు పాన్ ఆధార్ లింక్ చేయనట్లయితే పాన్ కార్డ్ ఇనాపరేటివ్ అవుతుంది. అంటే పాన్ కార్డ్ సేవలు పనిచేయవు. దీంతో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఇన్ కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ కు జరిమాన చెల్లించాలి. ముఖ్యంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ట్యాక్స్ రీఫండ్ ప్రాసెసింగ్ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇన్వెస్ట్ మెంట్, శాలరీ రూపంలో వచ్చే ఆదాయంపై ఎక్కువగా టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలు కూడా కోల్పోయే ఛాన్స్ ఉంటుంది.

ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లోనూ పాన్, ఆధార్ కార్డులను లింక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఆన్ లైన్ లో లింక్ చేసేందుకు ముందుగా ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఈ ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ కి వెళ్లి..అందులోని క్విక్ లింక్స్ సెక్షన్ లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ , పేరు వంటి వివరాలను అందులో నమోదు చేయాలి. దీంతో లింకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories