Tesla Motors: మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ టెస్లా

Tesla Motors CEO Elon Musk Wealth 21.64 Lakh Crore on 26 10 2021
x

21.64 లక్షల కోట్లకు చేరుకున్న మస్క్ సంపద విలువ(ఫైల్ ఫోటో)

Highlights

* లక్ష టెస్లా కార్లకు ఆర్డర్ ఇచ్చిన హెర్జ్ గ్లోబల్ హోల్డింగ్స్ * ఒక్కరోజే రూ.2.71 లక్షల కోట్లు ఆర్జన

Tesla Motors: గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రికార్డులు నెలకొల్పుతున్నారు. సోమవారం ఎలాన్ మస్క్ సంపద విలువ 288.6 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 21.64 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన గంటకు 11.31 కోట్లు, సెకన్‌కు సుమారు 3 కోట్లు సంపాదిస్తున్నారు.

హెర్ట్జ్ గ్లోబల్ అనే సంస్థ లక్ష టెస్లా కార్ల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వడంతో ఈ సంస్థ షేర్ పైపైకి దూసుకెళ్లింది. ఈ ఏడాది ప్రారంభంలోనూ ఎలాన్ మస్క్ నికర విలువ, ఎక్సాన్ మొబిల్‌ను అధిగమించినప్పటికీ, తదుపరి చమురు ధరల పెరుగుదల కారణంగా ఆ కంపెనీ విలువ అధికమైంది. విచిత్రం ఏమిటంటే చమురు ధరలు ఎంత పెరిగితే, ప్రత్యామ్నాయంగా కనపడుతున్న విద్యుత్‌ కార్లు అంతగా అమ్ముడుపోతాయి.

దీంతో మస్క్‌ సంపదా కూడా పెరుగుతుంది. మస్క్‌తో పాటు టెస్లా కూడా సోమవారం మరో రికార్డు సృష్టించింది. తొలిసారిగా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువను చేరింది. కంపెనీ షేరు విలువ 1024.86 డాలర్లకు చేరడంతో నాస్‌డాక్‌లో ట్రేడింగ్‌ ముగింపు నాటికి సంస్థ విలువ 75 లక్షల కోట్లకు పైగా దూసుకెళ్లింది.

Show Full Article
Print Article
Next Story
More Stories