Ten Rupees Coin: పది రూపాయల నాణెం చెల్లుబాటు అవుతుందా..లేదా..? ఆర్బీఐ ఏం చెబుతోంది..?
Ten Rupees Coin: గడచిన కొన్ని సంవత్సరాలుగా 10 రూపాయల నాణెం చెల్లడం లేదనే వార్తలతో దుకాణాల్లోనూ, ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ ఎక్కడ ఉపయోగించడం లేదు. దీనికి కారణం ఆర్బిఐ 10 రూపాయల నాణాలను చెల్లుబాటుపై నిషేధం విధించిందనే నెపంతో కస్టమర్ల నుంచి ఈ నాణేలను తిరస్కరిస్తున్నారు.
Ten Rupees Coin: గడచిన కొన్ని సంవత్సరాలుగా 10 రూపాయల నాణెం చెల్లడం లేదనే వార్తలతో దుకాణాల్లోనూ, ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ ఎక్కడ ఉపయోగించడం లేదు. దీనికి కారణం ఆర్బిఐ 10 రూపాయల నాణాలను చెల్లుబాటుపై నిషేధం విధించిందనే నెపంతో కస్టమర్ల నుంచి ఈ నాణేలను తిరస్కరిస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా ఆర్.బి.ఐ కఠినంగా హెచ్చరికలు జారీ చేసింది. ఏ రూపంలో ఉన్నప్పటికీ రూ. 10 కాయిన్ చెల్లుతుందని వ్యాపారులు వాటిని స్వీకరించకపోతే చట్టపరంగా శిక్షార్హులవుతారని హెచ్చరించింది.
ఇప్పటికే ఆర్.బి.ఐ పలుమార్లు పది రూపాయల నాణెం విషయంలో అనేకసార్లు వ్యాపారులకు బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పది రూపాయల నాణేాలు విపణిలో చెల్లుబాటు అవుతాయని పది రూపాయల నాణాలను రద్దు చేశారంటూ అపోహలు వ్యాపింప చేయడం చటారీత్యా నేరమని కూడా హెచ్చరించింది. ఈ మేరకు 2016 లోనే ఆర్బిఐ పత్రిక ప్రకటన సైతం జారీ చేసింది. ఆ తర్వాత 2018 లో సైతం ఆర్బిఐ ఈ ప్రకటన విడుదల చేసింది. కానీ వ్యాపారులు మాత్రం పది రూపాయల నాణేల విషయంలో ఆర్బిఐ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వస్తున్నారు. దీంతో ఆర్బిఐ మరోసారి కఠినంగా హెచ్చరించేందుకు సిద్ధం అవుతోంది.
నిజానికి పది రూపాయల నోటు కన్నా పది రూపాయల నాణాలను స్వీకరించినట్లయితే ఇవి ఎక్కువ కాలం చెల్లుబాటులో ఉంటాయి. పది రూపాయల నోట్లు వాడకం ఎక్కువగా ఉండటం వల్ల అవి చినిగిపోయే ప్రమాదం ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని విలువ తక్కువగా ఉన్న కారణంగా పది రూపాయల నాణాలను ఆర్బిఐ ప్రవేశపెట్టింది. కానీ వ్యాపారులు మాత్రం పది రూపాయల నాణేల విషయంలో అపోహలను నమ్మి, కస్టమర్ల వద్ద నుంచి పది రూపాయల కాయిన్స్ తీసుకోవడం మానేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున బ్యాంకులు ఆర్బీఐ చెస్టులో చినిగిన నోట్లతో పాటు రూ. 10 నాణేలను కూడా జమ చేయాల్సి వస్తోందని బ్యాంకు అధికారులు సైతం వాపోతున్నారు. అంతేకాదు ఆర్బిఐ ఇప్పటికీ పది రూపాయల నాణాలను పెద్ద ఎత్తున ముద్రిస్తోంది.
ఇవన్నీ కూడా చెస్టుల్లోనే నిలిచిపోతూ ఉండటంతో ప్రస్తుతం ఆర్బీఐ ఈ విషయంలో సీరియస్ గా వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు నేడు విజయవాడలో బ్యాంకర్లు అదేవిధంగా రిటైలర్లతో ఆర్బిఐ సమావేశం కూడా ఏర్పాటు చేసింది. పది రూపాయల నాణేలు చెల్లుబాటులో లేవు అనేది కేవలం అపోహ మాత్రమేనని, ఈ అపోహను వ్యాపింప చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించింది. వీటితోపాటు 5 రూపాయల నోట్ల విషయంలో కూడా ఇదే తరహాలో ప్రజల్లో అపోహలు ఉన్నాయి. దీనిపై కూడా గతంలో ఆర్బిఐ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఐదు రూపాయల నోట్లు మార్కెట్లో చెల్లుబాటులోనే ఉన్నాయని, వీటిని ఆర్బిఐ ఉప సంహరించుకోలేదని స్పష్టం చేసింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire