Tata Group: టాటా చేతిలోకి ఎయిర్‌ఇండియా.. డీల్ విలువ ఎంతో తెలుసా..?

Tata Group Wins Air India bid of Rs 18,000 Crore
x

Tata Group: టాటా చేతిలోకి ఎయిర్‌ఇండియా.. డీల్ విలువ ఎంతో తెలుసా..?

Highlights

Tata Group: గతేడాది అక్టోబరు 8న ఎయిరిండియా బిడ్‌ను టాటా గ్రూప్ గెలుచుకుంది.

Tata Group: గతేడాది అక్టోబరు 8న ఎయిరిండియా బిడ్‌ను టాటా గ్రూప్ గెలుచుకుంది. ఎయిర్ ఇండియా-టాటా గ్రూప్‌ల ఈ డీల్ రూ.18,000 కోట్లకు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు. దీంతో ఎయిర్‌ ఇండియా స్వదేశానికి తిరిగివచ్చినట్లయింది. నిన్న (జనవరి 27) టాటా గ్రూపునకు అప్పగించారు. ఎయిర్ ఇండియా దేశీయ విమానాశ్రయాలలో 4,480, అంతర్జాతీయంగా 2,738 ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్‌లను నిర్వహిస్తోంది. అలాగే కంపెనీకి విదేశీ విమానాశ్రయాలలో పార్కింగ్ కోసం దాదాపు 900 స్లాట్‌లు ఉన్నాయి.

ఎయిర్ ఇండియా ఉద్యోగులకు పంపిన సందేశంలో ఎయిర్ ఇండియా ఫైనాన్స్ జనవరి 24 న కంపెనీ బ్యాలెన్స్ షీట్ మూసివేస్తుందని తద్వారా టాటా గ్రూప్ దానిని సమీక్షించవచ్చని తెలిపారు. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లలో 100 శాతం, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ AISATS లో 50 శాతం వాటాను పొందుతోంది. టాటా ఎయిర్ ఇండియా ఈ డీల్‌కు బదులుగా ప్రభుత్వానికి రూ.2,700 కోట్ల నగదును అందిస్తుంది. ఎయిర్‌లైన్స్‌పై బకాయి ఉన్న రూ.15,300 కోట్ల రుణాన్ని తీసుకుంటుందని డిక్లేర్ చేసింది.

ఇప్పుడు టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా అనే మూడు విమానయాన సంస్థలను నిర్వహిస్తుంది. గ్రూప్ ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లను విలీనం చేయవచ్చు. దీంతో దేశ విమానయాన పరిశ్రమలో టాటా గ్రూపు ఆధిపత్యం మొదలవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎయిర్‌ఇండియాకి మంచి గుర్తింపు ఉంది. దీని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతి వారం 665 విమానాలను నడుపుతోంది. యిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మరియు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆర్మ్ AISATS అమ్మకాలతో సహా. 2003-04 తర్వాత ఇదే తొలి ప్రైవేటీకరణ.

Show Full Article
Print Article
Next Story
More Stories