Stock Markets: లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

Stock Markets on the Path to Profitability
x

Stock మర్కెట్స్:(ఫైల్ ఇమేజ్)

Highlights

Stock Markets: సెన్సెక్స్‌ 467 పాయింట్లు ఎగబాకి 48,908 వద్ద, నిఫ్టీ 152 పాయింట్లు పెరిగి 14,477 వద్ద కొనసాగుతున్నాయి.

Stock Markets: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు భారీ లాభాలతో ట్రేడింగ్‌ మొదలెట్టాయి. ఈ రోజు ఉదయం 9.41 సమయంలో సెన్సెక్స్‌ 467 పాయింట్లు ఎగబాకి 48,908 వద్ద, నిఫ్టీ 152 పాయింట్లు పెరిగి 14,477 వద్ద కొనసాగుతున్నాయి. వాబ్కో ఇండియా, లక్స్‌ ఇండస్ట్రీస్‌, సోమ్నిహోమ్‌, ఎన్‌సీసీ, కేపీఐటీ టెక్నాలజీస్‌ లాభాల్లో ఉండగా.. మెజెస్కో ఎల్‌, జయప్రకాశ్‌ అసోసియేట్స్‌, ఎడల్వైజ్‌ ఫిన్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటా కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అన్ని రంగాలకు చెందిన సూచీలు నేడు లాభాల్లోనే ట్రేడవుతుండటం విశేషం. నేడు కల్యాణ్‌ జ్యూవెలర్స్‌, సురోడే స్మాల్‌ ఫినాన్స్‌ బ్యాంక్‌ షేర్లు నేడు మార్కెట్లో లిస్టింగ్‌ కానున్నాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ధర రూ.159 తగ్గగా.. వెండి కిలోకు రూ.345 కుంగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.21పైసలు తగ్గి 72.78గా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories