Stock Markets: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

Stock Markets Ended With Loss
x

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

Highlights

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోమారు నష్టాల్లో ముగిశా యి. క్రితం సెషన్ లో భారీ నష్టాల్లో ముగిసిన దేశీ స్టాక్ సూచీలు వారాంతాన సైతం అదే బాటన...

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోమారు నష్టాల్లో ముగిశా యి. క్రితం సెషన్ లో భారీ నష్టాల్లో ముగిసిన దేశీ స్టాక్ సూచీలు వారాంతాన సైతం అదే బాటన సాగాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ వెరసి బెంచ్ మార్క్ సూచీలు ప్రధాన మద్దతుస్థాయిలకు దిగువన ట్రేడింగ్ ఆరంభించాయి.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 440 పాయింట్ల నష్టంతో 50,405 వద్దకు చేరగా, నిఫ్టీ 142 పాయింట్లు కోల్పోయి 14,938 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. మరోవైపు గ్లోబల్ మార్కెట్ లో ముడిచమురు ధరలు ఏడాది గరిష్టానికి చేరి పరుగులు తీస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 4.2 శాతం మేర ఎగసి 66.74 డాలర్ల వద్దకు చేరింది. జనవరి 2020 తర్వాత ఇదే అత్యంత గరిష్టంగా నమోదయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories