దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జైత్రయాత్ర ...

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జైత్రయాత్ర ...
x
Highlights

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జైత్రయాత్ర కొనసాగిస్తున్నాయి. తాజావారంలో వరుసగా మూడో రోజు భారత ఈక్విటీ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. మార్కెట్ చరిత్రలో...

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జైత్రయాత్ర కొనసాగిస్తున్నాయి. తాజావారంలో వరుసగా మూడో రోజు భారత ఈక్విటీ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా 200 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ 50 వేల పాయింట్ల మార్క్ ను అధిగమించింది. మరోవైపు నిఫ్టీ సైతం 14,700 పాయింట్ల ఎగువకు చేరింది. అగ్రరాజ్యం అమెరికాలో కొలువుదీరిన కొత్త పాలనా యంత్రాంగం ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించవచ్చన్న మదుపర్ల అంచనాల నేపధ్యంలో గ్లోబల్ మార్కెట్లు పరుగులు దీస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు విదేశీ మదుపర్ల నిరవధిక పెట్టుబడులు కార్పొరేట్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెరసి మార్కెట్లు ర్యాలీ కొనసాగిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories