Stock Market: వరుసగా ఆరో రోజూ నష్టాల్లో దేశీయ సూచీలు

Stock Market Closing Bell Nifty below 24,800, Sensex down 638 pts
x

Stock Market: వరుసగా ఆరో రోజూ నష్టాల్లో దేశీయ సూచీలు

Highlights

Stock Market: వరుసగా ఆరో రోజూ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి.

Stock Market: వరుసగా ఆరో రోజూ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్‌ అండతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. తీవ్ర ఒడుదొడుకుల మధ్య ఆరంభ లాభాలు కోల్పోయాయి. ముఖ్యంగా ఎఫ్‌ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో పతనమయ్యాయి.

సెన్సెక్స్‌ 638.45 పాయింట్ల నష్టంతో 81వేల 50 వద్ద ముగియగా..నిఫ్టీ సైతం 218.85 పాయింట్ల నష్టంతో 24 వేల 795.75 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోగా.. ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories