Business Idea: తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.. కేవలం రూ.10,000 ఉంటే చాలు..!

Start A Stationery Business With Rs.10000 Earn Up To Rs.20000 Per Month
x

Business Idea: తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.. కేవలం రూ.10,000 ఉంటే చాలు..!

Highlights

Business Idea: కొంతమందికి ఉద్యోగం చేయడం అంటే ఇష్టం ఉండదు. లాభం తక్కువగా వచ్చినా పర్వాలేదు కానీ ఏదైనా వ్యాపారం చేయాలని కోరుకుంటారు.

Business Idea: కొంతమందికి ఉద్యోగం చేయడం అంటే ఇష్టం ఉండదు. లాభం తక్కువగా వచ్చినా పర్వాలేదు కానీ ఏదైనా వ్యాపారం చేయాలని కోరుకుంటారు. ఇంకొందరికి బిజినెస్‌ చేయాలని ఆశ ఉండి డబ్బులు పెట్టుబడి పెట్టలేనివారు కూడా ఉంటారు. వీరందరికి ఈ వ్యాపారం ఒక మంచి స్వయం ఉపాధి అని చెప్పవచ్చు. ఎవరికింద పనిచేయకుండా సొంతంగా దీనిని నిర్వహించుకోవచ్చు. నెలకి రూ.15000 నుంచి రూ.20000 వరకు సంపాదించే ఒక బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

మనం మాట్లాడుకునే బిజినెస్‌ స్టేషనరీ షాపు. దీనిని కళాశాలలు లేదా పాఠశాలకు సమీపంలో ఏర్పాటు చేయవచ్చు. కేవలం రూ.10,000 పెట్టుబడి సరిపోతుంది. పూర్తి స్థాయిలో చేయాలంటే రూ.50,000 నుంచి రూ.60,000 వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. కానీ మంచి ఆదాయం కూడా వస్తుంది. దుకాణంలో పెన్నులు, పెన్సిళ్లు, నోట్ బుక్స్, ఇతర స్టేషనరీ వస్తువులను విక్రయించవచ్చు. దీనికి తోడు జిరాక్స్ మిషిన్ ఏర్పాటు చేసుకుంటే మరింత ఎక్కువగా ఆదాయాన్ని సంపాదించవచ్చు.

అలాగే గ్రీటింగ్ కార్డులు, డెకరేషన్ ఐటమ్స్ వంటి ఫ్యాన్సీ వస్తువులను విక్రయించుకోవచ్చు. ఏడాది పొడుగునా వీటికి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా షాప్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాండెడ్ ఉత్పత్తులను విక్రయిస్తే 30 నుంచి 40 శాతం వరకు మార్జిన్ పొందవచ్చు. మంచి విక్రయాలు చేస్తున్నట్లయితే ప్రతినెల రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఆదాయాన్ని పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories