Business Idea: వచ్చే సమ్మర్‌కి ఈ బిజినెస్‌ ప్లాన్‌ చేయండి.. లాభాలు మాములుగా ఉండవు..!

Snow Flake Ice Cream Business Idea Investment and Profits in Telugu
x

Business Idea: వచ్చే సమ్మర్‌కి ఈ బిజినెస్‌ ప్లాన్‌ చేయండి.. లాభాలు మాములుగా ఉండవు..!

Highlights

Business Idea: సీజనల్‌ వ్యాపారాల్లో ఎలాంటి లాభాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Business Idea: సీజనల్‌ వ్యాపారాల్లో ఎలాంటి లాభాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంత కాలమే అయినా భారీగా లాభాలు ఆర్జించవచ్చు. అయితే కొన్ని వ్యాపారాలు కేవలం సీజన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఇతర సీజన్స్‌లోనూ భారీగా లాభాలను తెచ్చి పెడతాయి. అలాంటి బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఐస్‌క్రీమ్‌లకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఐస్‌క్రీమ్‌లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. కాగా ఐస్‌క్రీమ్‌ తయారీలోనూ ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా స్నో ఫ్లేక్స్‌ ఐస్‌క్రీమ్‌కు ఇప్పుడు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. ఇలాంటి బిజినెస్‌ను ప్రారంభిస్తే ఊహకందని లాభాలు ఆర్జించవచ్చు. పట్టణాల్లో జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఈ బిజినెస్‌ను ప్రారంభిస్తే నష్టం అనే సమస్యే ఉండదు.

ఈ స్నోఫ్లేక్స్‌ ఐస్‌క్రీమ్‌ను తయారు చేయడానికి మిషిన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ మిషన్‌లో మీకు కావాల్సిన ఫ్లేవర్‌ డ్రింక్‌ను పోస్తే చాలు. మంచు రూపంలో ఐస్‌క్రీమ్‌ బయటకు వస్తుంది. ఆన్‌లైన్‌ వేదికగా ఈ స్నో ఫ్లేక్స్‌ ఐస్‌క్రీమ్‌ తయారీ మిషిన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ మిషిన్‌ ద్వారా పాలు, పండ్ల రసాలు, చెరుకు రసం, కూల్‌ డ్రింక్స్‌ ఇలా రకరకాల ఫ్లేవర్స్‌తో ఐస్‌క్రీమ్‌లను తయారు చేసుకోవచ్చు.

మంచు రూపంలో వచ్చే ఐస్‌క్రీమ్‌ను ఒక కప్పులో వేసి సర్వ్‌ చేస్తుంటారు. స్నో ఫ్లేక్స్‌ ఐస్‌క్రీమ్‌ తయారీ మిషిన్‌ ధర రూ.50 వేలుగా ఉంటుంది. పెళ్లిళ్లలో స్టాల్స్‌లా కూడా వీటిని ఏర్పాటు చేయొచ్చు. ఇక ఒక్కో ఐస్క్రీమ్‌ను సాధారణంగా రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయించుకోవచ్చు. అయితే ఒక ఐస్‌ క్రీమ్‌ తయారీకి సుమారు రూ. 10 నుంచి రూ. 15 ఖర్చవుతుంది. ఇలా ఎంత కాదన్నా ఒక్కో ఐస్‌ క్రీమ్‌కు రూ. 30 లాభం ఏటూ పోదు. ఉదాహరణకు రోజూ 50 ఐస్‌క్రీమ్‌లను విక్రయించిన రూ. 1500 సంపాదించవచ్చు.

ఇక లాభాల విసయానికొస్తే.. ఒక్క ఐస్‌క్రీమ్‌ తయారు చేయడానికి సుమారు రూ. 10 నుంచి రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుంది. సరాసరి వీటిని రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయించుకోవచ్చు. ఎంత కాదన్న ఒక్క ఐస్‌క్రీమ్‌పై తక్కువలో తక్కువ రూ. 35 లాభం కచ్చితంగా వస్తుంది. ఈ లెక్కన రోజుకు 100 ఐస్‌క్రీమ్‌లను విక్రయించినా రూ. 3500 లాభం పొందొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories