Small Savings: 2022-23 ఆర్థిక సంవత్సరం పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఎంతంటే..?

Small Savings Scheme Interest Rates kept Unchanged | Saving Schemes in India
x

Small Savings: 2022-23 ఆర్థిక సంవత్సరం పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ఎంతంటే..?

Highlights

Small Savings: PPF, NSC పై వార్షిక వడ్డీ రేటు మొదటి త్రైమాసికంలో వరుసగా 7.1 శాతం, 6.8 శాతంగా ఉంటుంది...

Small Savings: 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం మార్చలేదు. 2020-21 మొదటి త్రైమాసికం నుంచి ఈ పథకాలపై వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. PPF, NSC పై వార్షిక వడ్డీ రేటు మొదటి త్రైమాసికంలో వరుసగా 7.1 శాతం, 6.8 శాతంగా ఉంటుంది.

చిన్న పొదుపు పథకాలకు సంబంధించి 2022-23 మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)ల ఎలాంటి మార్పు లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది వడ్డీ రేట్లు త్రైమాసిక ప్రాతిపదికన మారుస్తారు. ఏప్రిల్ 1, 2022 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.౫ శాతంగా ఉంటుంది. మరోవైపు బాలికల పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ రేటు ఐదేళ్లపాటు ఉంటుంది. సేవింగ్స్ ఖాతాపై వడ్డీ మునుపటిలాగే 4 శాతం ఉంటుంది. ఏడాది నుంచి ఐదేళ్ల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 5.5 శాతం నుంచి 6.7 శాతంగా ఉంటుంది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (RD)కి 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ నెల ప్రారంభంలో EPFO లేదా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2021-22కి వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి 8.1% నుంచి తగ్గించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కిసాన్ వికాస్ పత్ర ఏటా 6.9%, పెట్టుబడి పెట్టిన మొత్తం 124 నెలల్లో (10 సంవత్సరాల 4 నెలలు) రెట్టింపు అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories