Small Banks: ఈ చిన్న బ్యాంకులు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.. అవేంటంటే..?

Small Finance Banks and Payment Banks Offer High Interest Rates on Savings Accounts
x

Small Banks: ఈ చిన్న బ్యాంకులు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.. అవేంటంటే..?

Highlights

Small Banks: బీద, మధ్య తరగతి ప్రజలు సంపాదించిన సొమ్ముని అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు, పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు.

Small Banks: బీద, మధ్య తరగతి ప్రజలు సంపాదించిన సొమ్ముని అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు, పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. ఇందుకోసం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పొదుపు ఖాతాలలో ఎక్కువగా డిపాజిట్ చేస్తారు. అయితే చాలామంది ఏ బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లిస్తే అందులో పెట్టుబడి పెట్టాలని చూస్తారు. అయితే కరోనా వల్ల చాలా బ్యాంకులు వడ్డీ రేట్లని తగ్గించాయి. కానీ కొన్ని చిన్న బ్యాంకులు అధిక వడ్డీలను చెల్లిస్తున్నాయి. అ బ్యాంకులు ఏంటో చూద్దాం.

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో పొదుపు ఖాతాను ఓపెన్ చేస్తే 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నారు. త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీని చెల్లించేందుకు బ్యాంకు ఆఫర్ చేస్తోంది. ఆధార్‌ ద్వారా వెంటనే ఇందులో అకౌంట్‌ ఓపెన్ చేయవచ్చు.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

మీరు పొదుపు ఖాతాలో అధిక వడ్డీని పొందాలనుకుంటే పూర్తిగా డిజిటల్, పేపర్‌లెస్ బ్యాంక్ అయిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ని ఆశ్రయించవచ్చు. ఇక్కడ మీరు సేవింగ్స్ ఖాతాపై 6 శాతం వడ్డీ రేటును పొందుతారు. ఏ కస్టమర్ అయినా కేవలం 5 నిమిషాల్లో యాప్ సహాయంతో ఖాతాను ఓపెన్‌ చేయవచ్చు. అధిక వడ్డీ ప్రయోజనం పొందవచ్చు.

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతా కస్టమర్లకు 6.25 శాతం వడ్డీని అందిస్తోంది. దీంతో పాటు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్‌లపై కస్టమర్లకు అనేక రకాల ఆఫర్‌లను ప్రకటిస్తోంది. బ్యాంకును సంప్రదించడం ద్వారా మీరు మీ ఖాతాను చాలా సులభంగా ఓపెన్ చేయవచ్చు.

ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో మీరు అధిక వడ్డీ రేటుతో పొదుపు ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఇక్కడ రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్‌పై 4 శాతం రూ. 1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్‌పై 6.5 శాతం వడ్డీ లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories