Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ విషయంలో ఈ పనిచేయండి.. చర్యలు తప్పుతాయి..!

Show Driving License on DigiLocker Get Relief From Traffic Actions
x

Driving License: డ్రైవింగ్‌ లైసెన్స్‌ విషయంలో ఈ పనిచేయండి.. చర్యలు తప్పుతాయి..!

Highlights

Driving License: కారు లేదా బైక్‌ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

Driving License: కారు లేదా బైక్‌ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లేకుండా వాహనాలు నడిపితే ట్రాఫిక్ పోలీసులు చర్య తీసుకుంటారు. పెనాల్టీతో పాటు జైలుకి పంపిస్తారు. కానీ మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి జేబులో లేకుంటే మాత్రం ఏంకాదు. బేషరతుగా వాహనాలు నడపవచ్చు. దీని కోసం ఒక్క పని మాత్రం చేయాలి. డిజిటల్ ఇండియాను ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం DigiLocker పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఇందులో భారతదేశ పౌరులు తమ ముఖ్యమైన పత్రం సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయవచ్చు . ఈ కాపీ ప్రతిచోటా చెల్లుబాటు అవుతుంది.

ఈ పరిస్థితిలో మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను మీ వద్ద ఉంచుకోకూడదనుకుంటే సాఫ్ట్ కాపీని డిజిలాకర్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ అసలు కాపీని సౌకర్యవంతంగా ఇంట్లో దాచుకోవచ్చు. బైక్ లేదా స్కూటర్ నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ పోలీసు ఆపివేస్తే డిజిలాకర్‌లో అప్‌లోడ్ చేసిన లైసెన్స్ సాఫ్ట్ కాపీని వారికి చూపించవచ్చు. వారు ఎటువంటి చర్యలు తీసుకోరు. ఇది ప్రభుత్వ ఆమోదితంగా నడుస్తోంది.

దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా లెర్నింగ్ లైసెన్స్.. తర్వాత కొద్దిరోజులకు అఫీషియల్ లైసెన్స్ వస్తుంది. అయితే దీనికి ముందు డ్రైవింగ్ టెస్ట్‌ పాసవ్వాలి. లేదంటే డ్రైవింగ్‌ లైసెన్స్ రాదు. దీనికోసం డ్రైవింగ్ స్కూల్‌కి వెళ్లి డ్రైవింగ్‌ నేర్చుకోవడం అవసరం. ట్రాఫిక్‌కు సంబంధించిన ప్రాథమిక నియమాలతో పాటు డ్రైవింగ్‌పై పట్టు సాధిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ సులువుగా వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories