ఐసీఐసీఐ, పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు ఖాతాదారులకి బ్యాడ్‌న్యూస్..!

Shocking decision of PNB and ICICI Bank net banking hike external benchmark based lending rates
x

ఐసీఐసీఐ, పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు ఖాతాదారులకి బ్యాడ్‌న్యూస్..!

Highlights

ఐసీఐసీఐ, పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు ఖాతాదారులకి బ్యాడ్‌న్యూస్..!

ICICI PNB Bank: ICICI PNB Bank:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (rbi)ద్రవ్య సమీక్షా విధాన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాటు రెపో రేటును 0.50 శాతం అంటే 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ప్రకటన తర్వాత ప్రజలపై ఈఎంఐ భారం పెరుగుతుందని అందరు భావించారు. అందుకు తగినవిధంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, పీఎన్‌బీ రుణ రేటును పెంచాయి. దీంతో ప్రజలపై అప్పుల భారం పెరగనుంది. ఆర్‌బీఐ రెపో రేటును 0.50 శాతం నుంచి 5.40 శాతానికి పెంచింది. మే తర్వాత ఇది మూడో పెరుగుదల. తాజా పెంపుతో రెపో రేటు లేదా స్వల్పకాలిక రుణ రేటు ప్రీ-పాండమిక్ స్థాయి 5.15 శాతం దాటింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రామాణిక వడ్డీ రేటును 0.50 శాతం పెంచిన తర్వాత ICICI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ రేట్లని పెంచాయి. ఆర్‌బిఐ వడ్డీ రేటును 0.5 శాతం పెంచింది. దీంతో రెపో రేటు మూడేళ్ల గరిష్ట స్థాయి 5.40 శాతానికి చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఐ-ఇబిఎల్‌ఆర్‌ని ఆర్‌బిఐ పాలసీ రేటుకు సూచిస్తున్నట్లు బ్యాంక్ నోటీసులో తెలిపింది. బ్యాంక్, "I-EBLR సంవత్సరానికి 9.10 శాతం, నెలకు చెల్లించాలి.

ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా వడ్డీ రేటును పెంచింది. "RBI రెపో రేటును పెంచిన తర్వాత రెపో సంబంధిత రుణ రేటు (RLLR) ఆగస్టు 8, 2022 నుంచి అమలులోకి వచ్చేలా 7.40 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. దీంతో పెరిగిన EMI కారణంగా ప్రజలు అదనపు డబ్బు చెల్లించవలసి ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు రెపో రేటు వద్ద మాత్రమే సెంట్రల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటాయన్న విషయం తెలిసిందే. రెపో రేటుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చైర్మన్ దినేష్ ఖరా మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, మార్కెట్లలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ చర్య సహాయపడుతుందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories