SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకి షాక్‌.. మార్చి 17 నుంచి మరింత చెల్లించాల్సిందే..!

Shock for SBI Customers Some Changes are Happening from March 17
x

SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకి షాక్‌.. మార్చి 17 నుంచి మరింత చెల్లించాల్సిందే..!

Highlights

SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకి ఇది బ్యాడ్‌న్యూస్‌ అని చెప్పాలి.

SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకి ఇది బ్యాడ్‌న్యూస్‌ అని చెప్పాలి. ఎస్‌బీఐలో ఖాతా ఉంటే బ్యాంకు పెద్ద దెబ్బ కొట్టింది. ఇక నుంచి మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. మార్చి 17, 2023 నుంచి బ్యాంక్ కొన్ని మార్పులు చేయబోతోంది. ఇది నేరుగా కస్టమర్‌లను ప్రభావితం చేస్తుంది. వచ్చే నెల నుంచి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకుందాం.

SBI క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించే వినియోగదారులపై నేరుగా ప్రభావం పడనుంది. బ్యాంకు కార్డు రుసుమును పెంచింది. ఈ సవరణ 17 మార్చి 2023 నుంచి వర్తిస్తుంది. దీని గురించి SBI నుంచి మెస్సేజ్‌ మెయిల్ వస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ ద్వారా తమ ఛార్జీలు చెల్లించే వినియోగదారులకు ఇప్పుడు రూ.199తో పాటు ఇతర పన్నులు విధిస్తారని సమాచారం. నవంబర్ 2022లో SBI క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో రూ.99, 18% GSTకి పెంచింది. అయితే రూ.99 వర్తించే పన్నులకు బదులుగా ఇప్పుడు రూ.199 పన్ను విధిస్తుంది. దీనిపై వినియోగదారులకు సమాచారం అందించారు. కొత్త రేట్లు త్వరలో అమలులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

ఇప్పటికే చాలా బ్యాంకులు

ఎస్‌బీఐ కార్డ్ అద్దె చెల్లింపులో ప్రాసెసింగ్ ఫీజును పెంచుతున్నట్లు తెలిపాయి. SBI క్రెడిట్ కార్డ్ అద్దె చెల్లింపు లావాదేవీలపై ఛార్జీలు సవరిస్తున్నారు. ఇంతకు ముందు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ కూడా ఈ ఛార్జీలని పెంచింది. ఫిబ్రవరి 15, 2023 నుంచి కోటక్ బ్యాంక్ లావాదేవీ మొత్తం, GST ఛార్జీలో 1 శాతం వసూలు చేస్తుంది. అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 1 శాతం లావాదేవీ రుసుమును వసూలు చేస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రివార్డ్ పాయింట్‌లను మార్చింది. ICICI బ్యాంక్ 20 అక్టోబర్ 2022 నుండి రేట్లను మార్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories