7th Pay Commission: కేంద్ర ఉద్యోగులకి షాక్.. వేతన నిబంధనలలో మార్పులు..!

Shock for Central Employees Changes in Wage Norms Government has Issued Orders
x

7th Pay Commission: కేంద్ర ఉద్యోగులకి షాక్.. వేతన నిబంధనలలో మార్పులు..!

Highlights

7th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు ఇది షాకింగ్‌ న్యూస్‌ అని చెప్పాలి.

7th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు ఇది షాకింగ్‌ న్యూస్‌ అని చెప్పాలి. బోనస్, డీఏల శుభవార్త మధ్య ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పరిధిలోకి వచ్చే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఏకకాలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ జరిమానాల చర్యకు సంబంధించి ఒక వివరణను జారీ చేసింది. 7వ వేతన సంఘం కింద వచ్చే ఉద్యోగులకు ఈ నిబంధన వర్తిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

పెనాల్టీ మొదటి చర్య సమయంలో, రెండవ చర్యను అమలు చేయవచ్చని DoPT ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. అంటే ఏకకాలంలో రెండు జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఒక ఉద్యోగికి ఏకకాలంలో రెండు జరిమానాలు విధిస్తున్నారని, రెండు శిక్షలు ఏకకాలంలో అమలు అవుతాయని శిక్ష విధించే అధికారులు ఉత్తర్వుల్లో స్పష్టంగా రాయాలని డిపార్ట్‌మెంట్ పేర్కొంది. రెండు శిక్షలు ఏకకాలంలో అమలు అవుతాయని లేదా ఒకటి ముగిసిన తర్వాత మరొకటి వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది.

నియమం ఏమిటి?

అథారిటీ తన ఆర్డర్‌లో స్పష్టంగా పేర్కొనకపోతే రెండు శిక్షలు కలిసి వర్తిస్తాయని, ఒకేసారి అమలు అవుతాయని సిబ్బంది విభాగం తెలియజేసింది. ఈ నియమం ప్రకారం.. తదుపరి ఆర్డర్ భారీ జరిమానాను కలిగి ఉంటే అది మునుపటి ఆర్డర్‌పై వెంటనే అమలు అవుతుంది. దాని గడువు ముగిసిన తర్వాత మునుపటి ఆర్డర్ వ్యవధి మిగిలి ఉంటే అది కూడా పూర్తవుతుంది. 7వ పే కమీషన్ కింద జీతం పొందే ఉద్యోగుల కోసం DoPT అనేక నియమాలలో మార్పులు చేసింది.

పెన్షన్,గ్రాట్యుటీ అందదు

దీనికి ముందు ప్రభుత్వం CCS (పెన్షన్) రూల్స్ 2021లో కూడా మార్పులు చేసింది. దీని ప్రకారం ఒక కేంద్ర ఉద్యోగి తన సర్వీస్ సమయంలో తీవ్రమైన నేరం లేదా నిర్లక్ష్యానికి పాల్పడినట్లు తేలితే అతని పెన్షన్ లేదా గ్రాట్యుటీ రెండూ నిలిపివేస్తారు. దీంతో పాటు కేంద్ర ఉద్యోగుల ప్రయాణ భత్యానికి సంబంధించిన నిబంధనలను మార్చారు. ఈశాన్య ప్రాంతం, జమ్మూ,కాశ్మీర్, లడఖ్ లేదా అండమాన్, నికోబార్‌లకు విమాన ప్రయాణానికి సీసీఎస్ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) రూల్స్ 1988 ప్రకారం ఉద్యోగులకు మినహాయింపు ఉంది. దీని కింద కేంద్ర ఉద్యోగులు సెప్టెంబర్ 25, 2024 వరకు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories