Stock Market: సరికొత్త గరిష్టాలను నమోదు చేసిన సెన్సెక్స్, నిఫ్టీ

Sensex, Nifty Hit New Highs
x

Stock Market: సరికొత్త గరిష్టాలను నమోదు చేసిన సెన్సెక్స్, నిఫ్టీ

Highlights

Stock Market: ఉదయం లాభాల్లో, సాయంత్రానికి నష్టాలతో ముగింపు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఇంట్రాడేలో భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో రెండు ప్రధాన సూచీలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్‌.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 75 వేల 655 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై... 76 వేల 9 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 19.89 పాయింట్ల నష్టంతో 75 వేల 390 వద్ద ముగిసింది. నిఫ్టీ 24.65 పాయింట్లు కోల్పోయి 22 వేల 932 వద్ద స్థిరపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories